Belly Fat : నేటి తరుణంలో మనలో చాలా మంది పొట్ట దగ్గర కొవ్వు చేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం కారణంగా అలాగే కూర్చుని పని చేయడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వల్ల నచ్చిన బట్టలు వేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే అందవిహీనంగా కూడా కనిపిస్తారు. అంతేకాకుండా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక మనం పొట్ట దగ్గర పేరుకుపోయిన ఈ కొవ్వును వీలైనంత త్వరగా కరిగించుకోవాలి. కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల అలాగే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవచ్చు.
ఈ చిట్కాలు పూర్తిగా సహజ సిద్దమైనవి. అలాగే వీటిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచిఫలితం ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిన వారు రోజూ పది గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. ఫైబర్ మన శరీరంలో కొవ్వును కరిగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పచ్చికూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరు ధాన్యాల వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. అలాగే ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. శరీరం నుండి చెమట ఎక్కువగా వచ్చే వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది.
అదే విధంగా రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలి. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల జీవక్రియలు మందగించి శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కనుక రోజూ 8 గంటల పాటు నిద్రపోవాలి. అంతేకాకుండా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి ఒత్తిడి కూడా ఒక కారణమే. కనుక ఒత్తిడి, ఆందోళన వంటివి మన దరి చేరకుండా చూసుకోవాలి. అలాగే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయిన వారు ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ అల్లం పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. అలాగే ఒక కప్పు నీటిలో 5 పుదీనా ఆకులు వేసి 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఇందులో గ్రీన్ టీ పౌడర్ వేసి మూత పెట్టి గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ లో ఒక కప్పు లేత కొబ్బరి నీళ్లు, అర టీ స్పూన్ సోంపు పొడి, ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా పొట్ట తగ్గుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, అర టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి జీవన విధానాన్ని పాటించడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.