మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఆపిల్ పండ్లు కూడా ఒకటి. రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల వైద్యునికి దూరంగా ఉండవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ఆపిల్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఆపిల్ పండ్లు ఎంతో దోహదపడతాయి. ఆపిల్ పండ్లను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్థమా వంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనలో చాలా మంది రోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఆపిల్ పండ్లను తీసుకునే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. ఆపిల్ పండ్లను కొందరు నేరుగా శుభ్రం చేసుకుని తింటూ ఉంటారు. మరికొందరు వాటిపై ఉండే పొట్టును తీసేసి తింటారు. అయితే ఆపిల్ పండ్లను ఎలా తీసుకోవాలి.. పొట్టుతో తినాలా.. పొట్టు తీసేసి తినాలా.. ఎలా తింటే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది… ఇలా అనేక రకాల అపోహలను కలిగి ఉన్నారు. అయితే నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు. ఆపిల్ పండ్లను ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆపిల్ పండ్లను తొక్కతో తింటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ పండ్ల తొక్కలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే అనేక రకాలుగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆపిల్ పండ్లను తొక్కతో తింటేనే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆపిల్ పండ్లపై ఉండే తొక్కను తీసేసి తిన్నాకూడా మేలు కలుగుతుంది. ఆపిల్ సైడ్ వెనిగర్ ను తొక్క తీసిన ఆపిల్ పండ్లతోనే తయారు చేస్తారు. కనుక ఆపిల్ పండ్లను తొక్క తీసి తిన్నా కూడా మేలు కలుగుతుంది. ఆపిల్ పండ్లను ఎలా తినాలనేది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆపిల్ పండ్లు అందంగా, మెరుస్తూ కనబడాలని వాటిపై రసాయనాలను స్ప్రే చేయడంతో పాటు మైనాన్ని కూడా పూస్తూ ఉంటారు. కనుక వాటిని తినే ముందు శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది. ఆపిల్ పండ్లను తొక్క తీసేసి తిన్నా లేదా తొక్కతో తిన్నా ఎలా తిన్నా కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.