శరీరంలో అనేక భాగాల్లో అంతర్గతంగా వాపులు రావడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తుంటాయి. వాపుల వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వస్తుంటాయి. అయితే వాపులు తగ్గాలంటే అందుకు మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. రోజూ తినే ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ పదార్థాలు ఉండేలా చూసుకుంటే చాలు. దాంతో వాపులు తగ్గుతాయి. వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను రాకుండా నివారించవచ్చు. మరి రోజూ ఆహారంలో తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలతోపాటు ఆకు కూరల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది వాపులను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ ఆహారంలో పాలకూర, క్యాబేజీ, కీరదోస, కొత్తిమీర వంటి వాటిని తీసుకుంటుండాలి. దీంతోపాటు పోషకాలు అందుతాయి. వాపులు తగ్గుతాయి.
2. పసుపు
అనేక రకాల భారతీయ వంటకాల్లో రోజూ పసుపును వాడుతుంటారు. ఇది దృఢమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ పదార్థంగా పనిచేస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. అల్లం
అల్లంలో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. దీంతో అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల రోజూ అల్లం రసంను సేవిస్తుంటే వాపులను తగ్గించుకోవచ్చు. తద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
4. బీట్ రూట్
డార్క్ పింక్ కలర్‌లో ఉండే బీట్ రూట్‌ను తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ బీట్ రూట్‌లో పోషక విలువలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాలి. వీటిలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. కాబట్టి రోజూ బీట్‌రూట్‌ను తీసుకుంటే మంచిది.
5. చేపలు
చేపలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అలాగే వాటిలో విటమిన్లు బి6, బి12, డి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. అందువల్ల తరచూ చేపలను తినాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365