Bottle Gourd Juice For Cholesterol : ఒక చిన్న చిట్కాను ఉపయోగించి రక్తనాళాల్లో అడ్డంకులన్నింటిని తొలగించుకోవచ్చు. గుండె జబ్బులను నయం చేసుకోవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల భవిష్యత్తులో గుండె సంబంధింత సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తనాళాలు శుభ్రపడతాయి. రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారాల కారణంగా గుండెలో మలినాలు, విష పదార్థాలు, టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. ఈ మలినాలు మనం శరీర అవయవాలకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో కూడా పేరుకుపోతున్నాయి. ఇలా పేరుకుపోవడం వల్ల కొంతకాలానికి రక్తనాళాలు పూడుకుపోతాయి. ఇలా పేరుకుపోవడం వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అంతేకాకుండా రక్తనాళాల్లో మలినాలు పేరుకుపోవడం వల్ల శరీరంలో 100 పైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడకపోవడం వల్ల శరీరంలో అవయవాల పనితీరు తగ్గుతుంది. జుట్టు రాలడం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కంటి చూపు మందగించడం, నీరసం, చేసే పని మీద శ్రద్ద లేకపోవడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం రక్తనాళాలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
దీంతో శరీరం కూడా అంతర్గతంగా శుభ్రపడుతుంది. రక్తంలో మలినాలు తొలగిపోతాయి. శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రక్తనాళాలను శుభ్రపరిచి గుండె సమస్యలు తలెత్తకుండా చేసే ఒక చక్కటి ఆయుర్వేదిక్ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయ, కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నాలుగు పదార్థాలు కూడా మనకు విరివిరిగా లభిస్తాయి. అలాగే నాలుగు పదార్థాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ జ్యూస్ కు తగినన్ని సొరకా ముక్కలను, 10 రెమ్మల కొత్తిమీరను, 10 రెమ్మల పుదీనాను, 10తులసి ఆకులను తీసుకోవాలి. వీటన్నింటిని ఒక జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఆరు నుండి ఏడు నెలల పాటు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే పండ్లును, తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా సొరకాయ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మన రక్తనాళాలు శుభ్రపడతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. రక్తంలో మలినాలు పేరుకుపోవడం వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.