Budama Kayalu : బుడమకాయలను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. బుడమకాయలతో పప్పు, ఆవకాయ, కూర, పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. బుడమకాయలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమకాయలలో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడానికి సహాయపడతాయి.
ఫైబర్ సమృద్దిగా ఉండడం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడతాయి. అలాగే శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తులను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి, రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన సన్నని గీతలు, ముడతలు, మచ్చలు, చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి, రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా బుడమకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి.