హెల్త్ టిప్స్

ఆపిల్స్‌తో న్యుమోనియాకు చెక్ పెట్ట‌వ‌చ్చా…

సాధార‌ణంగా అంద‌రూ ఇష్ట‌ప‌డే పండ్ల‌లో ఆపిల్ ఒక‌టి. ఆపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను రాకుండా కూడా చూసుకోవచ్చు. యాపిల్‌లో చక్కెర మోతాదు 10 నుండి 50 శాతం వరకూ ఉంటుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌ పండు తొక్క‌లో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది.

ప్రతీరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా యాపిల్ పండ్ల వల్ల న్యుమోనియా వ్యాధి రాకుండా చూసుకోవచ్చని ప‌రిశోధ‌కులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

can apple reduces pneumonia

నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయన వివరాలను తాజాగా ప్రచురించారు. దీని ప్ర‌కారం యాపిల్ పండ్లను తినడం వల్ల న్యుమోనియా రాకుండా ఉంటుందని తేలింది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని సైంటిస్టులు తేల్చారు. అదే విధంగా 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల `విటమిన్ సి` ద్వారా పొందే యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం.

అలాగే ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

Admin

Recent Posts