Soaked Black Chickpeas : మనం రుచిగా ఉంటాయని వివిధ రకాల ఆహార పదార్థాలను కలిపి వండుతూ ఉంటాం. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాలను కలిపి తింటూ ఉంటాం లేదా దానిని తిన్న వెంటనే ఇతర ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని విరుద్ద ఆహారాలు కూడా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోకూడదు. అలాగే వీటిని తిన్న వెంటనే ఇతర ఆహారాలను తీసుకోకూడదు. అలాంటి ఆహారాల్లో శనగలు కూడా ఒకటి. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలా అనేక రకాల పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. అయితే పరగడుపున శనగలను తీసుకున్న తరువాత మనం కొన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదు.
శనగలను తిన్న తరువాత వీటిని తీసుకోవడం వల్ల శరీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. శనగలు తిన్న తరువాత తీసుకోకూడని ఆహారాలు ఏమిటో మనకు ముందే తెలిస్తే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. శనగలు తిన్న తరువాత తీసుకోకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజూ జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉండే ట్రైనర్ లు నానబెట్టిన శనగలను, మొలకెత్తిన శనగలను ఉదయాన్నే తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఖాళీ కడుపున శనగలను తినడం మంచిదే. అయితే శనగలను తిన్న తరువాత ఇతర ఆహారాలను మాత్రం తీసుకోకూడదు. శనగలను తిన్న తరువాత పాలను తాగకూడదు. ఒకవేళ శనగలు తిన్న తరువాత పాలను తాగాల్సి వస్తే ఒక గంట తరువాత మాత్రమే పాలను తాగాలి.
శనగలు తిన్న తరువాత పాలను తాగడం వల్ల చర్మం పై బొల్లి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శనగలను తిన్న తరువాత వెల్లుల్లి రెబ్బలను తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రతిక్రియలు జరిగి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా శనగలను తీసుకున్న తరువాత కోడిగుడ్లను తీసుకోకూడదు. ఇవి రెండు మంచి ఆహారమే. అలాగే వీటిలో ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక గంట వ్యవధితో మాత్రమే వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మూడు పదార్థాలను శనగలతో పాటు తీసుకోకూడదని ఒకవేళ తీసుకోవాలంటే ఒక గంట వ్యవధితో మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.