Cooking Oil : వంట‌నూనెను ఒక్క‌సారి వాడిన త‌రువాత మ‌ళ్లీ వాడ‌వ‌చ్చా..? ఏం చేయాలి..?

Cooking Oil : సాధార‌ణంగా మ‌న భార‌తీయ వంట‌కాల్లో నూనెను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. నూనె వేయ‌నిదే మ‌నం ఏ వంట‌కాన్ని త‌యారు చేయ‌ము. అలాగే చిరుతిళ్లు వేయించ‌డానికి, పిండి వంట‌కాలు త‌యారు చేయ‌డానికి, డీఫ్రై వంట‌కాల‌ను త‌యారు చేయ‌డానికి నూనెను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అయితే నూనె మ‌న ఆరోగ్యానికి మంచిది కాద‌ని దీనిని త‌క్కువ‌గా వాడాల‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే డీప్ ఫ్రైకు వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌కూడ‌దని కూడా నిపుణులు చెబుతూ ఉంటారు. ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో మ‌న‌లో చాలా మంది వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌కుండా ప‌క్క‌కు పెడుతూ ఉంటారు. కొంద‌రు మాత్రం అదే నూనెను మ‌ర‌లా వాడుతూ ఉంటారు. వాడిన నూనెను మ‌ర‌లా పార‌బోయాల‌నిపించ‌దు.

ఇలాంట‌ప్పుడు కొన్ని చిట్కాల‌ను వాడుతూ మ‌ర‌లా వాడిన నూనెను సుల‌భంగా వాడుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వాడిన నూనెను వాడిన‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. వాడిన నూనెను తిరిగి వాడాల‌నుకునే వారు ముందుగా దానిని పూర్తిగా వ‌డ‌క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నూనె శుభ్ర‌ప‌డుతుంది. ఇలా డీప్ ఫ్రై చేసిన నూనెను మ‌ర‌లా డీప్ ఫ్రైకు వాడ‌కూడ‌దు.కేవ‌లం కూర‌లు వండ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగించాలి. అది కూడా నూనెను వాడిన రెండు రోజుల్లోనే తిరిగి వాడాలి. అలాగే వాడిన నూనెను మ‌ర‌లా త‌క్కువ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద మాత్ర‌మే వేడి చేయాలి. ఇలా చేయ‌డం వల్ల నూనెను వేడి చేసిన‌ప్ప‌టికి దాని నుండి పొగ రాకుండా ఉంటుంది. అలాగే వాడిన నూనెను మ‌ర‌లా వాడాలనుకునే వారు డీప్ ఫ్రైలు, పిండి వంట‌కాలు చేసేటప్పుడు స్టీల్ క‌ళాయిని మాత్ర‌మే ఉప‌యోగించాలి.

can we use Cooking Oil for more than once
Cooking Oil

ఇనుప క‌ళాయిలో వేసి వేడి చేసిన నూనె ఒక‌ర‌క‌మైన వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఇలా ఇనుప క‌ళాయిలో వేడి చేసిన నూనెను తిరిగి వాడిన‌ప్పుడు ఆ నూనెతో చేసిన వంట‌కాలు కూడా ఒక‌ర‌క‌మైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఒక్క‌సారి వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌కుండా ఉండ‌డ‌మే మంచిది. నూనెను మ‌ర‌లా మ‌ర‌లా వేడి చేయ‌డం వ‌ల్ల దానిలో ఫ్రీరాడిక‌ల్స్ పెరుగుతాయి. దీంతో ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. అయితే ఒక్కసారి వాడిన నూనెను మ‌ర‌లా వాడాల‌నుకునే వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

D

Recent Posts