అన్నం, చపాతీ.. భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు. అదే నార్త్ ఇండియా వైపు వెళ్తే చపాతీ ఎక్కువగా తీసుకుంటారు.. అన్నం తక్కువగా తింటారు. ఏదిఏమైనా అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్ లో భాగమైపోయాయి. అయితే.. అన్నం, చపాతీలో ఏది బెటర్. ఏది తింటే మంచిది.. ఏది తినకపోతే మంచిది.. లేకపోతే రెండు మంచివా? రెండు చెడ్డవా? ఇది చదవండి…
రోటీలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి మన శరీరానికి ఖచ్చితంగా అవసరం. ఇవి శరీరానికి రోజువారీగా అందుతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్నంలో కూడా ఐరన్ ఉంటుంది. కానీ.. ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం తక్కువ మోతాదులో ఉంటాయి. అన్నంలో అసలు కాల్షియమే ఉండదు.
రోటీ తినడం మంచిదే… అన్నం తినడం మంచిదే కానీ.. అది మీ బాడీ తత్వాన్ని బట్టి.. మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే రోటీ తింటే పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. అన్నం తొందరగా జీర్ణం అవుతుంది.. ఎందుకంటే అన్నంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారు రోటీ తీసుకుంటే బెటర్. తొందరగా ఆకలి వేయదు కాబట్టి.. ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా సమతుల్యమైన ఆహారం తీసుకునే వీలుంటుంది.