Coconut Oil For Diabetes : అన్నం మనకు ఎంతో కాలంగా ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అన్నాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు.చౌకగా బియ్యం లభించడంతో పాటు ఏ కూరతోనైనా కలుపుకుని తినగలిగే సౌలభ్యం ఉండడంతో అన్నాన్నే మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నం తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వండుకుని తినడం వల్లె మనం అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. శారీరక శ్రమ చేసే వారు అన్నాన్ని తిన్నప్పటికి ఎటువంటి జబ్బుల బారిన పడకుండా ఉంటారు. శారీరక శ్రమ తక్కువగా చేసే వారు, ఒకే దగ్గర కదలకుండా కూర్చొని పని చేసే వారు అన్నాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఒకే దగ్గర కూర్చొని పని చేసేవారిలో ఎక్కువగా క్యాలరీలు ఖర్చు అవ్వవు. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, షుగర్ వంటి జబ్బుల బారిన కూడా పడుతున్నాము. ఈ అన్నాన్నే ఒక ప్రత్యేకమైన పద్దతిలో వండుకుని తినడం వల్ల మన శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. కొవ్వు చేరదు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఎన్నో అద్భుత ఫలితాలను ఇచ్చే ఈ రైస్ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అన్నాన్ని వివిధ రకాలుగా వండుతారు. కొందరు గంజి వార్చి వండుతారు. కొందరు గంజి వార్చకుండా వండుతారు. కొందరు ఆవిరి మీద ఉడికిస్తారు.కొందరు రైస్ కుక్కర్ లో వండుతారు. కొందరు సాధారణ గిన్నెలో వండుతారు. అన్నాన్ని ఏ పాత్రలో ఎలా వండినా కూడా అన్నం వండేటప్పుడు అందులో కొబ్బరి నూనెను వేయాలి.
వంట కొబ్బరి నూనెను మాత్రమే దీనికోసం ఉపయోగించాలి. అలాగే మనం తీసుకున్న బియ్యానికి మూడు శాతం కొబ్బరినూనెను కలపాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కిలో బియ్యాన్ని తీసుకుంటే దానికి మూడు శాతం అనగా 30 గ్రాముల కొబ్బరి నూనెను కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తరువాత మామూలుగా ఎప్పుడూ వండినట్టే అన్నాన్ని వండుకుని తినాలి. అయితే ఇలా వండిన అన్నాన్ని వెంటనే తీసుకోకూడదు. ఇలా వండిన అన్నం చల్లారిన తరువాత 12 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత వేడి చేసుకుని తినాలి. ఇలా తీసుకోవడం వల్ల క్యాలరీలు మన శరీరంలోకి ఎక్కువగా చేరకుండా ఉంటాయి. ఇలా వండిన అన్నాన్ని ఎంత కావాల్సి వస్తే అంత తినవచ్చు. ఇలా వండిన అన్నాన్ని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొబ్బరి నూనె వేసి వండిన అన్నం జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఇలా వండిన అన్నాన్ని తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా చేరడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా వండిన అన్నాన్ని కొద్దిగా తీసుకుంటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు కూడా ఇలా కొబ్బరి నూనె వేసి వండిన అన్నాన్ని తినవచ్చు. ఇలా కొబ్బరి నూనె వేసి అన్నాన్ని వండుకుని తినడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము.