Constipation : మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సమస్యతో తీవ్ర అవస్థ పడుతుంటారు. సుఖ విరేచనం అవక ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక చలికాలంలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన సూచనలు పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. రోజూ మనం నిద్రించే భంగిమ కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. కనుక నిద్రించే భంగిమ కూడా ముఖ్యమే. ఎడమ వైపునకు తిరిగి నిద్రించడం వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై పేగుల్లో సులభంగా ముందుకు కలుగుతుంది. ఈ క్రమంలో మలబద్దకం సమస్య అనేది ఉండదు. కనుక ఎడమ వైపుకు నిద్రించడం మంచిది.
2. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలను రోజూ ఆహారంలో అధిక శాతం తీసుకుంటే మలబద్దకం సమస్య అసలు ఉండదు.
3. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చిప్స్, కుకీస్, అధికంగా మాంసం తినరాదు. వీటిని అధికంగా తీసుకుంటే మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.
4. రోజూ తగినంత నీటిని కూడా తాగాలి. నీటిని సరిగ్గా తాగకపోయినా మలబద్దకం వస్తుంది. కనుక రోజూ 3 లీటర్ల మేర అయినా సరే నీటిని తాగాల్సి ఉంటుంది.
5. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఒత్తిడి వల్ల కూడా మలబద్దకం వస్తుంది. అలాగే రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
6. తగినంత నిద్ర ఉండాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రిస్తే జీవక్రియల రేటు బాగుంటుంది. జీర్ణ సమస్యలు రావు. కాబట్టి తగినంత నిద్రిస్తే మలబద్దకం నుంచి బయట పడవచ్చు.