క‌రోనా నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది ఇళ్ల‌లో చికిత్స తీసుకుంటూ కోలుకంటున్నారు. కానీ కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయ్యే వారు రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటేనే శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతారు. పూర్తిగా రిక‌వ‌రీ అయ్యాక బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు. అందువ‌ల్ల కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయ్యే వారు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

covid recovery patients should take these foods

ప్రోటీన్లు

కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తరువాత శరీరాన్ని మళ్లీ బలంగా, చురుకుగా చేయడానికి ప్రోటీన్లు చాలా ముఖ్యం. ఇందుకోసం పప్పు దినుసులు, ధాన్యాలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి తీసుకోవాలి. మాంసాహారం తినేవారు గుడ్లు, చికెన్‌, చేపలు, ఇతర మాంసాలను తినాలి. ఉద‌యం తీసుకునే అల్పాహారం, మ‌ధ్యాహ్నం భోజనం, రాత్రి భోజ‌నంలో ప్రోటీన్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు

క‌రోనా నుండి కోలుకునేవారు ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. దీని వ‌ల్ల‌ మన శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ల‌భిస్తాయి. దీని ద్వారా మన శరీరం మళ్లీ చురుకుగా మారుతుంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు కూడా చాలా ముఖ్యం. అందువ‌ల్ల రోజూ గోధుమ‌లు లేదా మిల్లెట్స్‌తో చేసిన రొట్టెల‌ను తింటే మేలు.

నెయ్యి

క‌రోనా నుంచి కోలుకునేటప్పుడు శరీరానికి చాలా పోషకమైన ఆహారంగా నెయ్యి ప‌నిచేస్తుంది. క‌నుక ఆహారంలో రోజూ ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి తినడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగు ప‌రుస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. విట‌మిన్ డి ని శ‌రీరం స‌రిగ్గా ఉప‌యోగించుకునేలా చేస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts