దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్లలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకునేందుకు సెలబ్రిటీ న్యూట్రిషనిస్టు రుజుతా దివేకర్ పలు డైట్ టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే…
ఉదయం అల్పాహారానికి ముందు నీటిలో నానబెట్టిన బాదంపప్పు, కిస్మిస్‌లను తినాలి. రాగులతో చేసిన దోశను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో బెల్లం, నెయ్యి, రొట్టెలను తీసుకోవాలి. రాత్రి భోజనంలో కిచ్‌డీ తినాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. శరరీంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి.
కోవిడ్ బారిన పడి ఇంట్లో చికిత్స తీసుకునే వారు నీటిని ఎక్కువగా తాగాలి. షర్బత్, మజ్జిగ, కూరగాయల జ్యూస్ వంటి పానీయాలను ఎక్కువగా తాగాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి పోషకాలు అందుతాయి.
రోజుకు 3 సార్లు ఆవిరి పట్టాలి. అందులో వాము వేసి ఆవిరి పడితే మంచిది. అలాగే వేడి నీళ్లను గొంతులో పోసుకుని పుక్కిలించాలి. విటమిన్ సి, జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నారింజ, నిమ్మ, కివీ, బొప్పాయి పండ్లు, గుమ్మడి కాయ విత్తనాలు, బాదంపప్పు, పిస్తా వంటివి తినాలి. దీని వల్ల త్వరగా కోలుకుంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365