కోవిడ్‌ వ్యాక్సిన్‌ బాగా పనిచేయాలంటే.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఈ జాగ్రత్తలను పాటించాలి..!

భారత దేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రస్తుతం టీకాలను వేసే పని పూర్తి చేశారు. ఇప్పుడు ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. నిత్యం 1 లక్ష మందికి పైగా సిబ్బంది టీకాలను తీసుకుంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను వేసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా శరీరంలో యాంటీ బాడీలు తయారై కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తీసుకున్నాక రోగ నిరోధక శక్తి పెరిగేందుకు మనం కూడా పలు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.

covid vaccine theesukunnaka jagrathalu

* కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మద్యం సేవించరాదు. పొగ తాగరాదు. లేదంటే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేయదు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక రోగ నిరోధక శక్తి పెరిగే పనులు చేయాలి. కానీ తగ్గే పనులు చేయకూడదు. మద్యం సేవించడం, పొగ తాగడం వల్ల ఆ శక్తి తగ్గుతుంది. కనుక ఆ పనులు చేయరాదు.

* రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర పోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక వ్యాక్సిన్‌ తీసుకున్న వారు నిద్ర సరిగ్గా పోవాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాక్సిన్‌ సరిగ్గా పనిచేస్తుంది.

* రోగ నిరోధక శక్తి పెరగాలంటే నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయనివారు కనీసం వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత 2 నెలల పాటు అయినా వ్యాయామం చేస్తే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది.

* రోగ నిరోధక శక్తి పెరిగేందుకు వ్యాయామం, నిద్ర ఎంత అవసరమో, పోషకాలు ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవడం కూడా అంతే అవసరం. పాలు, పాల సంబంధ పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, నట్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ఈ జాగ్రత్తలను పాటిస్తే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts