మధ్యాహ్నం కాసేపు కునుకు తీసేవారు యాక్టివ్‌గా ఉంటారు.. సైంటిస్టుల వెల్లడి..

నిత్యం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు కునుకు తీస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు, మెదడు సంబంధ సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం లేదు. అవును.. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ మేరకు వారు కొందరిపై కొంత కాలం పాటు అధ్యయనం చేపట్టారు. ఆ తరువాత పై వివరాలను వెల్లడించారు.

madhyahnam nidratho arogyam

నిత్యం మధ్యాహ్నం కనీసం 2 గంటలు, అంతకన్నా తక్కువగా నిద్రపోయే వారికి వృద్ధాప్యంలో మెదడు బాగా పనిచేస్తుందని, పరిసరాల పట్ల అవగాహన బాగుంటుందని, ఆ వయస్సులోనూ మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని, ఆలోచనా శక్తి కలిగి ఉండే పనులను వారు బాగా చేయగలుగుతారని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు జనరల్‌ సైకియాట్రీ అనే జర్నల్‌లో వివరాలను ప్రచురించారు.

సైంటిస్టులు కొందరు 2214 మందిపై అధ్యయనం చేశారు. వారు నిత్యం ఎన్ని గంటలపాటు నిద్రపోతారు, ఎప్పుడు నిద్రపోతారు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, ఏ మేర యాక్టివ్‌గా ఉన్నారు.. అనే అంశాలను పరిశీలించారు. వారందరూ 60 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. ఇక అందులో 1534 మంది నిత్యం మధ్యాహ్నం నిద్రపోతామని చెప్పగా, 680 మంది నిద్రపోమని చెప్పారు. అయితే నిద్రపోతామని చెప్పిన వారిలో నాడీ సంబంధ వ్యవస్థ యాక్టివ్‌గా పనిచేస్తుందని, వారు చురుగ్గా ఉన్నారని గుర్తించారు. అయితే కేవలం కొందరిపై మాత్రమే ఈ పరిశోధన చేశారు, కానీ అధిక సంఖ్యలో వ్యక్తులపై పరిశోధన చేసి ఇంకా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని సైంటిస్టులు తెలిపారు. అయినప్పటికీ మధ్యాహ్నం కొంత సేపు నిద్ర పోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts