Curry Leaves With Garlic : రోజూ ఖాళీ క‌డుపుతో 5 క‌రివేపాకులు, ఒక వెల్లుల్లి రెబ్బ‌ను న‌మిలి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves With Garlic : మ‌నం వంట‌ల్లో క‌రివేపాకును, వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. క‌రివేపాకు అలాగే వెల్లుల్లి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని తెలుసు. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వంట‌ల్లో వాడ‌డానికి బదులుగా వీటిని ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌రివేపాకును, వెల్లుల్లిని ప‌ర‌గడుపున వాటిలో పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. అలాగే వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మ‌నం మ‌రింత అధికంగా పొంద‌వ‌చ్చు.

అయితే క‌రివేపాకును, వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఒక ఉద‌యం 5 క‌రివేపాకు ఆకుల‌ను, ఒక వెల్లుల్లిని బాగా న‌మిలి మింగాలి. త‌రువాత ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇలా క‌రివేపాకును, వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు, కొలెస్ట్రాల్ సుల‌భంగా తొల‌గిపోతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే వెల్లుల్లిని, క‌రివేపాకును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య అదుపులో ఉంటుంది.

Curry Leaves With Garlic take them on empty stomach daily
Curry Leaves With Garlic

గుండె ఆరోగ్యం మెరుగ‌ప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. క‌రివేపాకును, వెల్లుల్లిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో పేరుకుపోయిన మ‌లినాలు, విష ప‌దార్ఠాలు తొల‌గిపోతాయి. శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండాఉంటాము. రోజూ ఉద‌యం ప‌ర‌గడుపున క‌రివేపాకు, వెల్లుల్లిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీనత త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కంటిచూపు కూడా మెరుగుప‌డుతుంది. ఈ విధంగా క‌రివేపాకు, వెల్లుల్లిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts