సాధారణంగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ ముదిరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువంటపుడు వ్యాధి తీవ్రత తగ్గించుకోడానకి మందులతోపాటు ఆహారం కూడా నియంత్రించాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు వీరు తినరాదు. అవేమిటో పరిశీలించండి. తీపి పదార్ధాలు – పంచదార, బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు, తేనె, అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు. లిక్కర్ తాగరాదు. బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి.
ప్రాసెస్ చేసిన వేయించిన ఆహారాలు – ఈ రకమైన ఆహారాలు కొలెస్టరాల్ పెంచుతాయి. డయాబెటీస్ తోపాటు కొల్లెస్టరాల్ చేరితే సమస్య తీవ్రంగా వుంటుంది. వీటిలో కేలరీలు అధికం. లావెక్కిస్తాయి. గుండెజబ్బులు వస్తాయి. కనుక ఈ ఆహారాలు తినరాదు. తీపి పానీయాలు – డయాబెటీస్ రోగులు ద్రవాలు అధికంగా తీసుకోవాలి. అయితే తియ్యగా వుండే కూల్ డ్రింక్ లు ఇతర పానీయాలు, పేకేజ్డ్ జ్యూసులు, స్వీట్ టీ, మొదలైనవి తాగరాదు. నీరు తగినంత తాగాలి.
పిండి పదార్ధాలు – పిండిపదార్ధాలు అధికంగా వుండే బంగాళదుంప, బీట్ రూట్, గోధుమ, రైస్, పస్తా, వైట్ బ్రెడ్ ఇతర స్టార్చ్ కూరలు తినరాదు. ఇవి బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి. ఆల్కహాల్ – ఆల్కహాల్ తాగేవారు సాధారణ షుగర్ స్ధాయి వుండేందుకు గాను దానిని నియంత్రించాలి. ఈ రకమైన ఆహారపర జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వలన వచ్చే ఆరోగ్య సమస్యలు నివారించుకుని హాయిగా జీవించవచ్చు. సంతులిత ఆహార ప్రణాళికకుగాను పోషకాహార నిపుణులను సైతం సంప్రదించాలి.