హెల్త్ టిప్స్

వివిధ రకాల టీలు.. వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి వేడి టీ తాగితే ఎంతో ఉత్సాహం వస్తుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది. మైండ్‌ మంచి మూడ్‌లోకి రావాలన్నా, మంచి ఆలోచనలు తట్టాలన్నా.. టీ తాగాలి. అయితే కామన్‌ గా మనం తాగే టీ గురించి అందరికీ తెలుస. కానీ వివిధ రకాల హెర్బల్‌ టీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

different types of teas and their benefits

1. తులసి టీ

తులసి టీని తాగడం వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు రావు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. క్యాన్సర్‌కు కారణం అయ్యే జీవరసాయనాలు తటస్థీకరింపబడతాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. కమోమిల్‌ టీ

గడ్డి చామంతి పూలతో ఈ టీని తయారు చేసుకోవచ్చు. దీన్ని తాగితే ఆహార నాళంలో ఆహారాలు, ద్రవాలు సులభంగా ప్రయాణిస్తాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా జరుగుతుంది. భోజనం చేసిన తరువాత ఈ టీని తాగాల్సి ఉంటుంది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది.

3. పెప్పర్‌మెంట్‌ టీ

ఈ టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీన్ని కూడా భోజనం చేశాకే తాగాలి. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ లక్షణాలు తగ్గుతాయి. బాక్టీరియా, ఫంగస్‌లు నాశనం అవుతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఆస్తమా, అలర్జీ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. కండరాలను ప్రశాంత పరుస్తుంది. తలనొప్పి, సైనస్‌, జింజివైటిస్‌లు తగ్గుతాయి. వికారం నుంచి బయట పడవచ్చు.

4. అల్లం టీ

సమర్థవంతమైన యాంటీ బాక్టీరియల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వికారం నుంచి బయట పడవచ్చు. రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కండరాలు పట్టేయడం తగ్గుతుంది. జలుబు, గొంతు సమస్యలు, ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. నీరసం నుంచి బయట పడవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. దగ్గు తగ్గుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ప్లేట్‌లెట్స్‌ అతుక్కోకుండా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. నోటి దుర్వాస తగ్గుతుంది.

5. జిన్సెంగ్‌ టీ

ఇది సయాటికా నుంచి ఉపశమనం అందిస్తుంది. ఆకలి బాగా అయ్యేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శ్వాసక్రియ, జీర్ణక్రియలను మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జీర్ణాశయపు అల్సర్లు, డయేరియా తగ్గుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

6. బ్లాక్‌ టీ

బ్లాక్‌ టీని తాగడం వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

7. గ్రీన్‌ టీ

రక్తనాళాల్లో ప్లేట్‌లెట్స్‌ అతుక్కోవు. బీపీ తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

8. క్రాన్‌ బెర్రి టీ

ఈ టీని తాగితే జీర్ణాశయ బాధలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts