technology

విమానంలో ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచంలోనే వేగమైన ప్రయాణం విమాన ప్రయాణం. విమానాల్లో ప్రయాణం చేయటం అంటే.. చాలా మందికి బాగా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా కొన్ని లక్షల్లో జరిమానా, అక్కడితో ఆగకుండా జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే విమానంలో ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

విమానంలో మొబైల్ ఫోన్ వాడితే ఎలక్ట్రానిక్ వ్యవస్థ పాడై విమానం కూలిపోదు కానీ, పైలెట్లు ఏటీసీతో మాట్లాడేటప్పుడు కొంత నాయిస్ ను సృష్టించగలవు. వాతావరణం బాగా లేనప్పుడు రేడియో, టీవీలలో గరగరమని వచ్చే ధ్వని లాంటిది వచ్చి సంభాషణ స్పష్టంగా వినిపించకపోవచ్చు. ఇది పైలట్లకు చాలా చికాకు కలిగించే వ్యవహారం. అందుకే లాండింగ్, టేక్ ఆఫ్ సమయాలలో మొబైల్ ఫోన్లను ఆఫ్ చేయమని చెబుతారు. విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్లను ఆఫ్ చేయడం తప్పనిసరి. విమానంలో మొబైల్ ఫోన్లు వాడడం మంచిది కాదు.

what happens if you do not put your phone in flight mode in aero plane

సాధారణంగా పరికరాలు, మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్స్ కొనసాగుతాయి. అందువల్ల ప్రయాణికులు విమాన ప్రయాణానికి ముందు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచడం మంచిది. ఇలా చేసిన తర్వాత సిగ్నల్ ప్రసారం ఆగిపోతుంది. బ్రిటానికా వెబ్ సైట్ ప్రకారం, చాలా ఎయిర్ లైన్స్ ఈ రేడియో సిగ్నల్ ల ఉనికి విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన సిస్టం లను ప్రభావితం చేస్తుందని భావిస్తుంటారు.

అందుకే ఫోన్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ల విమానంలో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావితం చేయలేని విధంగా రూపొందించినప్పటికీ, ముందు జాగ్రత్తగా ఫోన్ లను ఆఫ్ చేయడం, ఫ్లైట్ మోడ్ లో పెట్టమని సూచిస్తారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్ లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ ప్రసారమే కారణమని భావిస్తున్నారు.

Admin

Recent Posts