హెల్త్ టిప్స్

Wake Up : ఉదయం లేచాక.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయకండి..!

Wake Up : ఉదయం లేచిన తర్వాత, కొన్ని పనులని అస్సలు చేయకూడదు. నిద్ర లేచిన తర్వాత, ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే, ఉదయం ఏ పనులు చేయాలి..?, ఏ పనులు చేయకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఉదయం లేవాలంటే, అందరు ఖచ్చితంగా అలారం పెట్టుకుంటారు. అయితే, టైం కి అలారం రింగ్ అవుతూ ఉంటుంది. దానిని, ఆఫ్ చేసి నిద్రపోతారు చాలా మంది. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఉదయాన్నే అలారం ఆపేసి, నిద్రపోవడం వలన అనుకున్న పనులు ఆగిపోతాయి.

ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. ఆఫీస్ కి వెళ్లడం కూడా లేట్ అవుతుంది. దీంతో, టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇతర ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి. టైం కి పనులు పూర్తవకపోతే, ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మానసిక సమస్యలు కూడా వస్తాయి. అలానే, చాలామంది ఉదయం లేచాక కాఫీ, టీ ని చాలామంది తాగుతూ ఉంటారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ ని తాగితే జీర్ణ సమస్యలు కలుగుతాయి. కాబట్టి, అసలు ఈ పొరపాటు చేయకండి.

do not make these mistakes after waking up

పొట్టలో కనుక గ్యాస్ నిండి పోతే, చాలా సమస్యలు కలుగుతాయి. ఉదయం లేచిన తర్వాత, చాలామంది గొడవ పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో కూడా చాలామంది, ఉదయం లేవగానే గొడవలు పడుతుంటారు. దీంతో మూడ్ పాడవుతుంది. పదే పదే రోజంతా ఆ గొడవ గుర్తుకు రావడం, మనసుకి ఇబ్బందిగా మారిపోతుంది. సో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే, పాజిటివ్ గా ఉండాలి.

పాజిటివ్ గా ఉంటే, రోజు బాగుంటుంది. సంతోషంగా ఉండొచ్చు. ఉదయం లేవగానే, చాలామంది మొబైల్ ఫోన్ ని చూస్తూ ఉంటారు. మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి, మొబైల్ ఫోన్ ని ఉదయం లేవగానే చూడడం మంచిది కాదు. ఫోన్లో ఇబ్బందికరమైన మెసేజెస్, వీడియోస్ వంటివి చూసినప్పుడు అది మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. కనుక, ఉదయం లేచిన తర్వాత ఫోన్ చూడడం కూడా మంచిది కాదు.

Admin

Recent Posts