Cashew Nuts : జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రుచిగా ఉండడం వలన ఎక్కువ మంది తినడానికి ఇష్టపడుతుంటారు. జీడిపప్పుతో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. చాలామంది జీడిపప్పుతో స్పెషల్ గా బిర్యానీ, కాజు పనీర్ వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇటువంటివి తింటే సూపర్ రుచిగా ఉంటాయి. జీడిపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పును తీసుకోవడం వలన గుండెకి చాలా మేలు కలుగుతుంది.
కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కూడా జీడిపప్పు పెంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే జీడిపప్పుని తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. జీడిపప్పుని ఫ్రై చేసుకుని తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. జీడిపప్పుని నేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచి కలుగుతుంది.
ఆరోగ్యంగా జీడిపప్పును తినాలనుకుంటే పెంకుతో ఉన్న జీడిపప్పుని కాల్చి లేదా ఎండబెట్టి జీడిపప్పుల్ని తీసుకొస్తారు కదా.. ఇలా కాల్చినప్పుడు టాక్సిన్స్ కూడా దూరం అవుతాయి. ఈ విధంగా జీడిపప్పుని ప్రాసెస్ చేయడం మంచిది. ప్రాసెస్ చేసిన జీడిపప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ప్రాసెస్ చేసిన జీడిపప్పుని చాలామంది నూనెలో వేసి, కారం, ఉప్పు వంటివి వేసి తీసుకుంటూ ఉంటారు.
కొంతమంది మసాలా కూడా వేసుకుంటూ ఉంటారు. ఇలా ఫ్రై చేసి తినడం వలన ఎలాంటి లాభం ఉండదు. ఇలా చేసిన జీడిపప్పులో పోషకాలు ఉండవు. కాబట్టి ఎప్పుడూ జీడిపప్పుని ఈ విధంగా తీసుకోకండి. దీని వలన నష్టమే తప్ప లాభం ఉండదు. ఈసారి జీడిపప్పుని తినేటప్పుడు ఈ విషయాలని గుర్తుపెట్టుకుని వీటిని పాటించినట్లయితే అనారోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన విధంగా ఫాలో అయిపోండి. ఆరోగ్యంగా ఉండండి.