Potatoes : ఆలుగ‌డ్డ కూర ఇలా తిన్నారో.. మీ బాడీలో బిగ్ డ్యామేజ్ జ‌రిగిపోతుంది..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్లుల‌, పెద్ద‌లు అంద‌రూ బంగాళాదుంప‌ను ఇష్టంగా తింటారు. వీటితో మ‌సాలా కూర‌లు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే బంగాళాదుంప‌ను ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంప‌ల‌ల్లో 97 కిలో క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. వీటిని నూనెలో వేయించి తీసుకోవ‌డం వల్ల క్యాల‌రీలు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో మ‌నం బ‌రువు ఎక్కువ‌గా పెరుగుతాము.

అలాగే బంగాళాదుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆక‌లి త‌క్కువ‌గా వేస్తుంది. ఈ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. బంగాళాదుంప‌ల్లో పొటాటో ప్రోటినేజ్ ఇన్ హిబిట‌ర్ 2 అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ప్రేగు మొద‌టి భాగంలో కొన్ని ర‌కాల మార్పుల‌ను తీసుకు వ‌చ్చి మ‌న‌కు ఆక‌లి వేయ‌కుండా చేస్తుంది. అయితే బంగాళాదుంప‌ల‌ను కూర‌గా వండుకున్న‌ప్పుడు ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం కొంత మేర న‌శిస్తుంది. అదే నూనెలో ఫ్రై చేసి తీసుకున్న‌ప్పుడు ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం పూర్తిగా న‌శిస్తుంది. దీంతో మ‌న‌కు ఆక‌లి త్వ‌ర‌గా వేస్తుంది. క‌నుక‌ బంగాళాదుంప చిప్స్ , ఫ్రైను తిన్న‌ప్పుడు ఆక‌లి తీర‌క వీటిని ఇంకా ఎక్కువ‌గా తింటూ ఉంటాము.

do not take Potatoes in this way
Potatoes

దీంతో బ‌రువు పెర‌గ‌డంతో పాటు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. కనుక ఈ బంగాళాదుంపల‌ను కూర‌గానే ఎక్కువ‌గా తీసుకోవాలి. అధిక బరువు, ఫ్యాటీ లివ‌ర్, షుగ‌ర్, శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయిన వారు వీటిని త‌క్కువ మొత్తంలో తీసుకోవాలి. అది కూడా కూర‌గానే తీసుకోవాలి. బంగాళాదుంప‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని ఆహారంగా తీసుకునే విషయంలో మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల బంగాళాదుంప‌లు మ‌న‌కు హానిని క‌లిగించేవిగా మార‌తాయి. క‌నుక బంగాళాదుంప‌ల‌ను కూర‌గానే వండుకుని తినాలి. అది కూడా త‌క్కువ మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts