Curd : పెరుగు తిన్న వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Curd : రుచిగా ఉంటాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలను క‌లిపి వండుకుని తింటూ ఉంటాం. ఇలా ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌డం వ‌ల్ల అవి రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఇలా తిన‌డం వ‌ల్ల వెంట‌నే ఎటువంటి ప్ర‌భావం చూపించ‌క పోయిన భ‌విష్య‌త్తులో అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఆయుర్వేదం ప్ర‌కారం విరుద్ద ఆహారాల‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు.విరుద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, శ‌రీరంలో వాపులు, గ్యాస్, ఎసిడిటి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాంటి స‌రిప‌డ‌ని కొన్ని రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి విరుద్ద ఆహారాల్లో పాలు, నిమ్మ‌కాయ ఒక‌టి. పాలల్లో నిమ్మ‌కాయ క‌లిపితే పాలు విరిగిపోతాయ‌ని మ‌నంద‌రికి తెలుసు.

పాలు, నిమ్మ‌ర‌సం అలాగే న\నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల సైన‌స్ వ‌చ్చే అవకాశం ఉంది. అలాగే ద‌గ్గు, జలుబు, అలర్జీ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ రెండు ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఈ రెండింటిని గంట వ్య‌వ‌ధితో తీసుకోవాలి. అలాగే కొంద‌రు పాల‌తో క‌లిపి ఉప్పు బిస్కెట్ల‌ను తింటూ ఉంటారు. పాల‌ల్లో తీపి రుచిని త‌ప్ప ఇత‌ర ప‌దార్థాల‌ను క‌ల‌ప‌కూడ‌దు. అలాగే కిచిడీ వంటి వంట‌కాల్లో పాల‌ను అస్స‌లు పోయ‌కూడ‌దు. అలాగే పాల‌తో క‌లిపి చికెన్, చేప‌లు వంటి ఆహారాల‌ను కూడా తీసుకోకూడ‌దు. పాల‌తో క‌లిపి వేపుడు వంటి ప‌దార్థాల‌ను కూడా తీసుకోకూడ‌దు. అదే విధంగా పాలు, కోడిగుడ్ల‌ను కూడా క‌లిపి తీసుకోకూడ‌దు. ఈ రెండింటిలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి.

do not take these foods after taking Curd
Curd

వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు పెరిగే అవ‌కాశం ఉంది. అలాగే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. కనుక ఈ రెండింటిని క‌లిపి తీసుకోకూడ‌దు. అలాగే పాలు, పాల ఉత్ప‌త్తుల‌తో ముల్లంగిని క‌లిపి తీసుకోకూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి పెర‌గ‌డంతో పాటు జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అదే విధంగా మిన‌ప‌ప్పును, మిన‌ప‌ప్పుతో చేసిన ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత కూడా వెంట‌నే పాల‌ను తీసుకోకూడ‌దు. అలాగే పండ్ల‌ను కూడా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోకూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పండ్ల‌ను ఎప్పుడూ కూడా కాలి క‌డుపుతోనే తినాలి. పండ్ల‌ను తిన్న రెండు గంట‌ల త‌రువాతే ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే పెరుగు తిన్న వెంట‌నే టీ, కాఫీ వంటి వాటిని తీసుకోకూడ‌దు. ముఖ్యంగా కొంద‌రు భోజ‌నం చేసే స‌మ‌యంలో చ‌ల్ల‌టి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే తేనెను కూడా వేడి ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోకూడదు. అలాగే పెరుగును, పుల్ల‌టి ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోకూడ‌దు. అదే విధంగా చేప‌ల‌ను, పెరుగును కూడా క‌లిపి తిన‌కూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే ఖ‌ర్జూరాల‌ను, చికెన్ ను కూడా క‌లిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఆహారం విష‌తుల్యం అయ్యే అవ‌కాశం ఉంది.

కొంద‌రు ఉడికించిన కోడిగుడ్డుపై నిమ్మ‌కాయ ర‌సాన్ని పిండికుని తింటూ ఉంటారు. ఇలా తిన‌డం రుచిగా ఉన్న‌ప్ప‌టికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. లోబీపీ సమస్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఇలా అస్స‌లు తీసుకోకూడ‌దు. అలాగే కోడిగుడ్డుతో అర‌టి పండును క‌లిపి తీసుకోకూడ‌దు. అలాగే ఉడికించిన కోడిగుడ్డును తీసుకున్న త‌రువాత చేప‌లను తిన‌కూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే నువ్వుల‌ను లేదానువ్వుల నూనెతో పాల‌కూర‌ను క‌లిపి తీసుకోకూడ‌దు.

Share
D

Recent Posts