ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రం అటు వర్షాకాలం కాకుండా, ఇటు వేసవి కాలం కాకుండా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ఎవరైనా శ్రద్ధ వహించాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్‌కు వెళ్లి డబ్బులు వదిలించుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో మనం తినే తిండి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని పడితే దాన్ని తినకూడదు. మరి ప్రస్తుత సమయంలో మనం తినకూడని అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఈ సమయంలో స్వీట్లు అస్సలు తినరాదు. తింటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా గుండె సంబంధ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు డయాబెటిస్ కూడా వస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిగిలిన కాలాల్లో పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు కానీ మరీ ముఖ్యంగా ఈ కాలంలో మాత్రం అస్సలు వీటిని తీసుకోరాదు. ఎందుకంటే ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అది అనారోగ్యాలకు దారి తీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టీ, కాఫీలను అయితే అస్సలు తాగరాదు. ఎందుకంటే ఇవి కొంత శక్తిని అందించినా తరువాత ఎనర్జీ లెవల్స్ బాగా పడిపోతాయి. నీరసంగా ఉంటుంది. కనుక వీటిని ప్రస్తుతం తీసుకోకూడదు.
నాన్ వెజ్ ఐటమ్స్‌ను ముట్టరాదు. ఎందుకంటే ఈ సమయంలో వీటిని తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయేరియా ఇబ్బంది పెడుతుంది. బాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కాబట్టి ఇప్పుడు వీటిని తినరాదు. నూనె పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్స్‌ను ఇప్పుడు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును దెబ్బతిస్తాయి. కనుక గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వస్తాయి. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రై చేసిన ఆలుగడ్డలు, పల్లీలు, ఇతర నట్స్ వంటి వాటిని కూడా ఇప్పుడు తీసుకోరాదు. ఇవి స్టమక్ అప్‌సెట్ కలిగిస్తాయి. జీర్ణ సమస్యలు వస్తాయి.