మన శరీరానికి నీరు ఎంతో అవసరం. ఈ విషయం మనందరికి తెలిసిందే. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో, శరీరంలో వ్యర్థపదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో అవసరమవుతుంది. రోజూ మనం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే మనలో చాలా మంది భోజన సమయంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. తెలిసి తెలియక మనం చేసే పెద్ద పొరపాట్లల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకునేటప్పుడు అస్సలు నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా నీటిని తాగడం వల్ల మనం అనారోగ్య సమస్లయ బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎటువంటి ఆహారాలను తీసుకునేటప్పుడు మనం నీటిని తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు మనం అస్సలు నీటిని తాగకూడదు. కారంగా ఉందని, గొంతు పట్టేస్తుందని మనలో చాలా మంది అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. అన్నం తినేటప్పుడు, అలాగే అన్నం తిన్న తరువాత నీటిని ఎక్కువగా తాగకూడదు. అన్నం తీసుకునే సమయంలో అలాగే తిన్న తరువాత నీటిని తాగడం వల్ల పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిర్లు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే పెరుగును తీసుకునేటప్పుడు కూడా నీటిని తాగకూడదు. పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. పెరుగును తీసుకున్న వెంటనే నీటిని తాగడం వల్ల దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గడంతో పాటు వివిధ రకాల జీర్ణసమస్యలు కూడా తలెత్తుతాయి.
కనుక పెరుగును తీసుకునేప్పుడు నీటిని తాగకూడదు. అదే విధంగా నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకున్న వెంటనే వాటిని తీసుకునేటప్పుడు నీటిని తాగకూడదు. ఈ పండ్లను తింటూ నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక నిమ్మజాతికి చెందిన పండ్లను తినేటప్పుడు నీటిని తాగకపోవడమే మంచిది. ఇక అరటిపండ్లను తినేటప్పుడు, తిన్న తరువాత వెంటనే కూడా నీటిని తాగకూడదు. అరటిపండ్లను తినేటప్పుడు నీటిని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. కనుక అరటి పండును తింటూ కూడా నీటిని తాగకూడదు.
అలాగే మసాలా పదార్థాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్న తరువాత ఈ ఘాటుకు ఓర్చుకోలేక చాలా మంది నీటిని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. ఇలా నీటిని తాగడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో నీటికి బదులుగా పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకునేటప్పుడు అలాగే తీసుకున్న తరువాత నీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ నీటిని తీసుకోవాల్సి వస్తే చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.