మధుమేహం వ్యాధి ఇటీవలి కాలంలో చాలా మంది వేధిస్తున్న సమస్య. అయితే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి పడుకునే ముందుకు కొన్ని పనులు చేస్తే చాలని అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు టీ, కాఫీ, చాక్లెట్ సోడా వంటి కెఫిన్ కలిగిన వాటిని తినకూడదు. కెఫిన్‌తో కూడిన పదార్థాలు మిమ్మల్ని నిద్రలేకుండా చేస్తాయి. దీనితో పాటు, ఆల్కహాల్ కూడా మానేయాలి. ఇది మీ నిద్రను చెడగొడుతుంది.
రాత్రి భోజనం తర్వాత కొంత శారీరక శ్రమ చేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిని చాలా సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాసనాలు వేయాలి. క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయండి. డిన్నర్ కు ముందు సలాడ్ తింటే కూడా మీ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ ఆహారంలో పిండి పదార్థాల పరిమాణం నియంత్రణలో ఉంటుంది.
అలాగే సలాడ్ లో చేర్చిన కూరగాయల నుంచి కూడా మంచి పోషకాలను పొందుతారు. మీరు ప్రతి రోజూ రాత్రి 8-9 గంటలు తగినంత నిద్ర పోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడం అవసరం. మరుసటి రోజు భోజనాన్ని ఒక రాత్రి ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.అలాగే జంక్ ఫుడ్ వినియోగానికి దూరంగా ఉండగలుగుతారు.మధుమేహం ఉన్నవారు తరచుగా దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.