తేనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. తేనెను రోజూ తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. శ్వాస సమస్యలు తగ్గుతాయి. అయితే మార్కెట్‌లో మనకు సాధారణకు తేనెతోపాటు మనుకా తేనె కూడా అందుబాటులో ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత తరుణంలో మనుకా తేనె చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. చాలా మంది దీన్ని వాడుతున్నారు. సాధారణ తేనె అంటే తేనెటీగలు సేకరించిన తేనె. కానీ మనుక తేనె అంటే ఇది కేవలం మనుక చెట్టుకు చెందిన పువ్వుల నుంచి వస్తుంది. కనుకనే ఇది అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాధారణ తేనె కన్నా 4 రెట్లు ఎక్కువగా పోషకాలు మనుక తేనెలో ఉంటాయని సైంటిస్టులు తెలిపారు. అందువల్లే ఈ తేనె చాలా ఖరీదు ఉంటుంది. అయినప్పటికీ ఈ తేనె సాధారణ తేనె కన్నా ఎక్కువ పోషకాలను అందిస్తుంది. కనుక ఖరీదు ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం ఈ తేనెను వాడవచ్చు.
ఇక మనుక తేనె మార్కెట్‌లో మనకు ఇతర తేనెలాగే లభిస్తుంది. ఈ తేనె పావు కిలో ధర సుమారుగా రూ.1800 వరకు ఉంటుంది. దీన్ని సాధారణ తేనెలాగే రోజూ తీసుకోవచ్చు. రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు, ప్రయోజనాలు కలుగుతాయి. మనుక తేనెను కొనే ముందు దానిపై UMF విలువ చూడాలి. దీన్నే యూనిక్ మనుక ఫ్యాక్టర్ అంటారు. అంటే ఈ విలువ ఎంత ఎక్కువ ఉంటే తేనె అంత నాణ్యంగా ఉంటుందని అర్థం.