హెల్త్ టిప్స్

Telagapindi : తెల‌గ‌పిండి గురించి తెలుసా.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Telagapindi : చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తెలియక దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే వేరుశనగ నూనె ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందని, వేరుశనగ నూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

నిజానికి వేరుశనగ నూనెలో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఆ నూనెను వేరు చేయగా మిగిలిన పిప్పిని తెలగపిండి అంటారు. దీనిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. తెలగపిండిని తీసుకుంటే హార్మోన్ల‌ ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కండ పుష్టికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. తెలగపిండిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.

do you know about telaga pindi it is very much nutritious

అధిక బరువు కలవారు కూడా దీన్ని తీసుకోవచ్చు. హై ప్రోటీన్స్ కలిగిన తెలగపిండిని గర్భిణీలు తీసుకుంటే బలంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రసవం జరిగిన తర్వాత స్త్రీలు ఆహారంలో దీన్ని తీసుకుంటే నీరసం ఉండదు. సామర్ధ్యం పెరుగుతుంది. బలంగా ఉంటారు. ఏదో ఒక రూపంలో తెలగపిండిని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. అనేక రకాల కూరల్లో మనం తెలగపిండిని వేసుకోవచ్చు. వేరుశెనగ కంటే ఎక్కువ ప్రోటీన్ దీనిలో ఉంటుంది.

ఆకుకూరలతో లేదంటే శనగపప్పుతో వండుకోవచ్చు. చాలామంది తెలగపిండిని డ్రైఫ్రూట్స్ తోపాటు లడ్డూల లాగా చేసుకుని తీసుకుంటూ ఉంటారు. వృద్ధులకి, పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే తెలగపిండి మంచే చేస్తుంది. తెలగపిండిని వడియాల లాగా కూడా పెట్టుకోవచ్చు. దీని ధర కూడా తక్కువే. కాబట్టి తెలగపిండిని మనం డైట్ లో తీసుకుని ఈ లాభాలని పొంద‌వ‌చ్చు. తెలగపిండిలో కొంచెం ఖర్జూరం పొడి, తేనె, నెయ్యి, బెల్లం వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. బీరకాయ, తెలగపిండి కలిపి కూర కూడా చేసుకోవచ్చు. ఆకుకూరలు, వెల్లుల్లితో కూడా వండుకోవచ్చు.

Admin

Recent Posts