మన శరీరానికి కావల్సిన పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయ మనందరికి తెలిసిందే. దీనిని మనం ప్రతిరోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటాం. నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అయితే నిమ్మకాయలను ఏవిధంగా తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ రసాన్ని నీటిలో పిండుకుని ఆ నీటిని మనం తాగుతూ ఉంటాం. ఇలా నిమ్మరసాన్ని నీటిలో వేయడానికి బదులుగా నిమ్మకాయలను ఉడికించిన నీటిని తాగడం వల్ల అధిక లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిమ్మకాయలను వేసి మరిగించిన నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం అద్భుత ఫలితాలను పొందవచ్చు. నిమ్మకాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను, చెడు కొవ్వును తొలగించడంలో ఈ నీరు ఎంతో సహాయపడుతుంది. మన ఆరోగ్యాన్ని మెరుగు పరిచే సహజ సిద్దమైన ఔషధం ఇది. అసలు నిమ్మకాయలతో ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను మనం 2 నిమ్మకాయలను, ఒక ఇంచు అల్లం ముక్కను, 4 వెల్లుల్లి రెబ్బలను, తగినంత తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నిమ్మకాయలను ముక్కలుగా కోసి వేయాలి. అలాగే అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేయాలి. తరువాత ఈ నీటిని మరో 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత దీనిలో తగినంత తేనెను కలుపుకుని తీసుకోవాలి. ఇలా నిమ్మకాయలతో డ్రింక్ ను తయారు చేసుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను తాగడం వల్ల సాధారణ జలుబు నుండి న్యూమోనియా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా నిమ్మకాయలతో నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయం శుభ్రపడి కాలేయం యొక్క పని తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ నీరు సమర్థవంతంగా, శక్తివంతంగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఇలా నిమ్మకాయలతో నీటిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని నేరుగా తీసుకోవడానికి బదులుగా ఇలా నిమ్మకాయలతో నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.