Black Coffee : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ఊబకాయం ఒకటి. అధిక బరువు సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు కూడా చాలా మందికి వస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధులకు బ్లాక్ కాఫీతో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.
బ్లాక్ కాఫీని రోజూ తాగితే అధిక బరువు సులభంగా తగ్గుతారు. అలాగే అందులో చక్కెర కలపకుండా తాగితే ఎఫెక్ట్ ఇంకా మరింత ఎక్కువ ఉంటుంది. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు బ్లాక్ కాఫీకి చెందిన పలు అద్భుతమైన విషయాలను తెలియజేశారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల బ్లాక్ కాఫీని తాగితే శరీరంలోని కొవ్వులో 4 శాతం కరిగిపోతుందని చెప్పారు. కనుక అధిక బరువును తగ్గించడంలో బ్లాక్ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది.
నిపుణులు చెబుతున్న ప్రకారం బ్లాక్ కాఫీలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. కనుక బ్లాక్ కాఫీ మనకు ఎంతో ఆరోగ్యకరమైందని చెప్పవచ్చు.
బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. మనం భోజనం చేశాక ఆహారాల్లో ఉండే గ్లూకోజ్‌ను శరీరం నెమ్మదిగా గ్రహించేందుకు ఇది సహాయ పడుతుంది. అలాగే కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా ఉంటుంది. దీంతో శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. ఫలితంగా శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం అధికంగా చేసేవారు.. బ్లాక్ కాఫీని తాగితే ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు. శరీరంలో ఎల్లప్పుడూ శక్తి ఉన్నట్లు ఫీలవుతారు.
బ్లాక్ కాఫీని తాగడం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, అతి నిద్ర, బద్దకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
బ్లాక్ కాఫీని రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం తాగాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంకో కప్పు తాగాలి. ఇక ఖాళీ కడుపుతో దీన్ని అసలు తాగరాదు. తాగితే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక తాగాలి. ఇక చక్కెర కలపకుండా బ్లాక్ కాఫీని తాగితే ఇంకా ఎక్కువ ఫలితం పొందవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇలా తాగడం మేలు చేస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.