Weight Gain : మనలో కొందరు ఉండాల్సిన బరువు కంటే కూడా చాలా తక్కువ బరువు ఉంటారు. ఇలా బరువు తక్కువగా ఉన్న వారిలో ఎముకలు ఎక్కువగా బయటికి కనిపించడం, చర్మం ముడుచుకుపోవడం వంటి వాటిని మనం చూడవచ్చు. బరువు తక్కువగా ఉండే వారిలో ఆరోగ్యంగా ఉండి కూడా బరువు తక్కువగా ఉండే వారిని మనం ఎక్కువగా చూడవచ్చు. ఇలాంటి వారు చూడడానికి కొద్దిగా అంద విహీనంగా ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను వాడడం వల్ల బరువు పెరగవచ్చు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.
సహజ సిద్దంగా లభించే పదార్థాలను వాడడం వల్ల కూడా మనం తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగి, కండ పుష్టి గా, బలంగా, చూడడానికి చక్కగా తయారవవచ్చు. బరువు పెరగడానికి శరీరానికి మేలు చేసే కొవ్వులను కలిగిన ఆహార పదార్థాలను, కండ పుష్టి కోసం ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను, బలం కోసం ఎక్కువగా క్యాలరీలు కలిగిన ఆహార పదార్థాలను మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కనుక మనం కొవ్వులను, ప్రోటీన్లను, క్యాలరీలను కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి.
చాలా మంది మాంసం తినడం వల్ల బరువు పెరుగుతారని భావిస్తారు. మాంసంలో కొవ్వులు, ప్రోటీన్స్ ఉంటాయి కానీ క్యాలరీలు అధికంగా ఉండవు. కొవ్వులు, ప్రోటీన్స్, క్యాలరీలు ఈ మూడింటినీ కలిగిన ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. అవే పచ్చి కొబ్బరి, వేరు శనగ పప్పు, పుచ్చ గింజల పప్పు, పొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, నువ్వులు. ఇవి మాంసం కంటే తక్కువ ధరలో లభిస్తాయి. అంతే కాకుండా మాంసం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా కొవ్వులు, ప్రోటీన్స్, క్యాలరీలను కలిగి ఉంటాయి.
ఈ పప్పులను నేరుగా తీసుకోవడం కంటే నీళ్లలో నానబెట్టుకుని తినడం వల్ల అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని బరువు తక్కువగా ఉన్న వారు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడమే కాకుండా శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.