Ginger Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి అల్లంను ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. అల్లం వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. అల్లంను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని నేరుగా తీసుకోలేని వారు రసం రూపంలో తీసుకోవచ్చు. లేదా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అల్లం నీళ్లను పరగడుపునే తాగడంవల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి అల్లం నీళ్లు బాగా పనిచేస్తాయి. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
2. అల్లంలో విటమిన్ సి, మెగ్నిషయం, ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు.. ముఖ్యంగా జ్వరం తగ్గుతాయి.
3. అల్లం నీళ్లను తాగితే వికారం, వాంతులు తగ్గిపోతాయి. విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్ ఉండదు. కడుపులో మంట కూడా తగ్గిపోతుంది.
4. అల్లం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. అల్లం నీళ్లను తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. రక్తం పలుచగా మారేలా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
5. అల్లం నీళ్లను తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అల్లంలో ఉండే ఫోలేట్, పొటాషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.