వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది చల్లని పానీయాలు తాగుతుంటారు. అలాంటి పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి. మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి బాగా తగులుతున్న సమయలో చల్లని చెరుకు రసం తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దాహం తీరడమే కాదు, వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. పోషకాలు, శక్తి అందుతాయి. ఇక చెరుకులో మొత్త 36 జాతులు ఉన్నాయి. అయినప్పటికీ చెరుకు రసంలో కొవ్వులు ఉండవు. ఇది 100 శాతం సహజసిద్ధమైన పానీయం. అందువల్ల వేసవిలో చెరుకు రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇక దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
240 ఎంఎల్ చెరుకు రసం ద్వారా మనకు 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. చెరుకు రసంలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. అందువల్ల తియ్యగా ఉందని, తాగాలా, వద్దా అని భయం చెందాల్సిన పనిలేదు. చెరుకు రసంలో కొవ్వు ఉండదు. కానీ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. వేసవిలో సహజంగానే మన శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ పోతుంటాయి. వాటిని చెరుకు రసం భర్తీ చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య రాదు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు.
ఎండ వల్ల తీవ్రమైన అలసటకు గురై శక్తి కోల్పోయిన వారు చెరుకు రసం తాగితే వెంటనే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. తిరిగి పనిచేయగలుగుతారు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చురుగ్గా మారుతుంది.
చెరుకు రసంలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ను సంరక్షిస్తాయి. దీంతో దంత క్షయం సమస్య రాకుండా ఉంటుంది. అలాగే చెరుకు రసంలో ఉండే పోషకాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. దీంతోపాటు దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
చెరుకు రసంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చెరుకు రసం ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగితే ప్రయోజనం ఉంటుంది. ఈ రసంలో ఉండే పొటాషియం శరీరంలోని పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీని వల్ల జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.