వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఎలాంటి జిమ్ ఎక్విప్‌మెంట్ లేకుండానే చాలా తేలిగ్గా రోజూ వాకింగ్ చేయవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే అధిక బరువు తగ్గాలనుకునేవారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేయాలేగానీ వారానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం నెల రోజుల వాకింగ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం – 20 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. తరువాత 15 నిమిషాల పాటు ఒక మోస్తరు వేగంతో వాకింగ్ చేయాలి. మళ్లీ 15 నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి.
మంగళవారం – 10 నిమిషాల నెమ్మది వాకింగ్ + 25 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (1 నిమిషం మోస్తరు, 4 నిమిషాల వేగం వాకింగ్ మార్చుతుండాలి) + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
బుధవారం – విశ్రాంతి
గురువారం – 20 నిమిషాల నెమ్మది వాకింగ్ + 15 నిమిషాల మోస్తరు వాకింగ్ + 15 నిమిషాల నెమ్మది వాకింగ్
శుక్రవారం – 10 నిమిషాల నెమ్మది వాకింగ్ + 20 నిమిషాల మోస్తరు వాకింగ్ + 20 నిమిషాల వేగవంతమైన వాకింగ్
శనివారం – 5 నిమిషాల నెమ్మది వాకింగ్ + 5 నిమిషాల మోస్తరు వాకింగ్ + 25 నిమిషాల వేగమైన వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
ఆదివారం – విశ్రాంతి
సోమవారం – 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 25 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
మంగళవారం – 5 నిమిషాల మోస్తరు వాకింగ్ + 35 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2 నిమిషాల మోస్తరు, 3 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
బుధవారం – విశ్రాంతి
గురువారం – 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 30 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
శుక్రవారం – 5 నిమిషాల మోస్తరు వాకింగ్ + 35 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2 నిమిషాల మోస్తరు, 3 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
శనివారం – 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 25 నిమిషాల వేగమైన వాకింగ్ + 15 నిమిషాల మోస్తరు వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
ఆదివారం – విశ్రాంతి
సోమవారం – 10 నిమిషాల నెమ్మది వాకింగ్ + 15 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 15 నిమిషాల వేగమైన వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
మంగళవారం – 40 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2.30 నిమిషాల మోస్తరు, 2.30 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 10 నిమిషాల నెమ్మది వాకింగ్
బుధవారం – విశ్రాంతి
గురువారం – 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 15 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్ + 5 నిమిషాల వేగమైన వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
శుక్రవారం – 20 నిమిషాల మోస్తరు వాకింగ్ + 20 నిమిషాల వేగమైన వాకింగ్ + 20 నిమిషాల నెమ్మది వాకింగ్
శనివారం – 50 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2 నిమిషాల మోస్తరు, 3 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
ఆదివారం – విశ్రాంతి
సోమవారం – 25 నిమిషాల మోస్తరు వాకింగ్ + 35 నిమిషాల వేగమైన వాకింగ్ + 5 నిమిషాల నెమ్మది వాకింగ్
మంగళవారం – 50 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2 నిమిషాల మోస్తరు, 3 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 10 నిమిషాల మోస్తరు వాకింగ్
బుధవారం – విశ్రాంతి
గురువారం – 30 నిమిషాల మోస్తరు వాకింగ్ + 20 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్
శుక్రవారం – 50 నిమిషాల మోస్తరు, వేగవంతమైన వాకింగ్ (2 నిమిషాల మోస్తరు, 3 నిమిషాల వేగమైన వాకింగ్ మార్చుతుండాలి) + 10 నిమిషాల మోస్తరు వాకింగ్
శనివారం – 40 నిమిషాల మోస్తరు వాకింగ్ + 20 నిమిషాల వేగమైన వాకింగ్ + 10 నిమిషాల మోస్తరు వాకింగ్
ఆదివారం – విశ్రాంతి
నెలలో 4 వారాల పాటు ఇలా రోజూ భిన్నమైన రీతిలో వాకింగ్ చేయాలి. నెమ్మదిగా, ఒక మోస్తరు వేగంతో, మరీ వేగంగా ఇలా.. వాకింగ్ వేగాన్ని మారుస్తూ వాకింగ్ చేయాలి. అలాగే చెప్పినన్ని నిమిషాల పాటు వాకింగ్‌ను ఒక స్పీడ్‌తో, ఇంకొన్ని నిమిషాల పాటు ఇంకో స్పీడ్‌తో వాకింగ్ చేయాలి. ఇలా మార్చి మార్చి స్పీడ్‌తో వాకింగ్ చేస్తూ రోజువారీ కోటాను పూర్తి చేయాలి. దీంతో నెలరోజుల్లోనే చెప్పుకోదగ్గ ఫలితం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా, వేగంగా తగ్గవచ్చు.