Heart Health Foods : నేటి తరుణంలో మనలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. హార్ట్ బ్లాక్స్, గుండెపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరగడం ఇలా అనేక రకాల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన జీవనవిధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, కూర్చుని పని చేయడం, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా హార్ట్ బ్లాక్స్ సమస్యతో బాధపడే వారు, రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఇప్పుడు చెప్పే డైట్ పద్దతిని పాటించడం వల్ల హార్ట్ బ్లాక్స్ సమస్య తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ ను పాటించడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది.
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంతో పాటు గుండె సమస్యలు రాకుండా చేసే డైట్ పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయం నిద్రలేవగానే లీటర్ నీటిని తాగి సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి. ఒక గంట తరువాత మరలా లీటర్ నీటిని తాగి మరోసారి విరోచనానికి వెళ్లాలి. ఇలా రెండు సార్లు విరోచనం అయ్యాక వ్యాయామం చేయాలి. రోజూ ఉదయం 9 నుండి 9. 30 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీటిని తాగుతూ వ్యాయామం చేస్తూ ఉండాలి. తరువాత నీటిలో మునగాకు పొడిని వేసి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడకట్టి తాగాలి.
రోజూ ఒక పెద్ద కప్పు మునగాకు కషాయాన్ని తీసుకోవడం వల్ల హార్ట్ బ్లాక్స్ తగ్గుతాయి. మునగాకు పొడిని తీసుకోవడం వల్ల 86శాతం హార్ట్ బ్లాక్స్ తగ్గుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా మునగాకు కషాయాన్ని తాగిన తరువాత 10. 30 సమయంలో వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. క్యారెట్, బీట్ రూట్, కొత్తిమీర లేదా పుదీనా వేసి 300 ఎమ్ ఎల్ జ్యూస్ చేసి తీసుకోవాలి. ఇక 12 గంటలకు మొలకెత్తిన విత్తనాలకు క్యారెట్ తురుము, కీరదోస ముక్కలు, టమాట ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి తీసుకోవాలి. ఇది తీసుకున్న తరువాత మనకు నచ్చిన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత సాయంత్రం 4 గంటల వరకు నీటిని తాగుతూ ఉండాలి. సాయంత్రం ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. అలాగే సాయంత్రం 6 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో ఉడికించిన ఆహారాలు కాకుండా వాల్ నట్స్, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి వాటిని నానబెట్టి తీసుకోవాలి. వీటికి తోడుగా అంజీర్, ఎండుద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి. వీటితో పాటు పండ్ల ముక్కలను ఆహారంగా తీసుకోవాలి.
ఇలా సహజ సిద్ద ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరంలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాలు మృదువుగా తయారవుతాయి. బీపీ సమస్య కూడా తగ్గుతుంది. రక్తం పలుచగా తయారవుతుంది. హార్ట్ బ్లాక్స్ క్రమంగా తగ్గుతాయి. గుండె సమస్యలతో బాధపడే ఈ విధంగా డైట్ ను పాటించడం వల్ల తిరిగి గుండె ఆరోగ్యంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డైట్ ను వారంలో 2 లేదా 3 సార్లు లేదా మనకు నచ్చినన్ని సార్లు చేయవచ్చని ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని, మన శరీర అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని నిపుణులు చెబుతున్నారు.