Drinking Coffee : కాఫీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా వారి రోజును కాఫీతోనే ప్రారంభిస్తారు. ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడుతున్నప్పుడు కూడా చాలా మంది కాఫీని తాగుతూ ఉంటారు. తలనొప్పిగా ఉన్నా కూడా కాఫీని తాగుతారు. సమావేశాలు జరిగే సమయంలో, ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయంలో ఇలా అనేక సందర్భాలలో కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీని తాగడం వల్ల శరీరానికి శక్తి లభించినట్టుగా ఉంటుంది. దీనిని తాగిన వెంటనే మరింత ఉత్సాహంగా పని చేస్తూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గినట్టుగా ఉంటాయి. అయితే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో టన్నిన్ అనే పదార్థం ఉంటుందని ఇది దంతాలపై మరకలు పడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు పచ్చ రంగులోకి మారతాయని అలాగే గంటల తరబడి కాఫీని తాగడం వల్ల దంతాలు కరిగిపోవడం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన నోటిలో 5.5 కంటే తక్కువ పిహెచ్ అర గంటకు పైగా ఉంటే దంతాలపై ఉండే ఎనామిల్ కరిగిపోవడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాపిచినో, విప్డ్ క్రీమ్ వంటి కాఫీలను తాగడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడడంతో పాటు వీటిలో ఉండే పంచదార దంతాలు పాడవడానికి కూడా దారి తీస్తుంది. కాఫీ తాగినప్పటికి దంతాలపై మరకలు పడకుండా ఉండాలంటే క్యారమలైజ్బ్ , క్రీమీ కాఫీ లను వీలైనంత వరకు తాగకపోవడమే మంచిది.
అలాగే కాఫీలను స్ట్రాతో తాగాలి. ఇలా తాగడం వల్ల దంతాలపై ఎక్కువగా మరకలు పడకుండా ఉంటాయి. అలాగే కాఫీ ని ఎక్కువ సేపు తాగడం తగ్గించాలి. కాఫీని తక్కువ మోతాదులో తాగడంతో పాటు త్వరగా తాగేయాలి. దంతాల ఆరోగ్యం పాడవడంతో పాటు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఒత్తిడి , ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. అలాగే కాఫీని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అలాగే కడుపులో ఎసిడిటీ, కడుపులో నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మన శరీరం మనం తీసుకున్న ఆహారం నుండి మినరల్స్ ను గ్రహించడం తగ్గిస్తుంది. దీంతో పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంది. కనుక ఎంత తక్కువగా తాగితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.