Dull And Dry Skin : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్స్ కూడా ఒకటి. మన శరీరానికి విటమిన్స్ చాలా అవసరం. ఇవి మన శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నేటి తరుణంలో వివిధ రకాల విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, మారిన జీవన విధానం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. విటమిన్స్ లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది ఇలా విటమిన్స్ లోపిస్తే శరీర ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటుంది అనుకుంటారు కానీ విటమిన్స్ లోపించడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మనలో చాలా మందికి తెలియదు. విటమిన్స్ లోపించడం వల్ల చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చర్మం కళను కోల్పోయినట్టుగా కనబడుతుంది.
చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక మన శరీరంలో విటమిన్స్ లోపం లేకుండా చూసుకోవాలి. శరీరంలో ఏయే విటమిన్స్ లోపించడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో, చర్మ ఆరోగ్యానికి ఏయే విటమిన్లు చాలా అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ ఇ లోపించడం వల్ల చర్మం పొడిబారడుతుంది. చర్మం నీరసంగా కనిపిస్తుంది. చర్మంలో తగినంత తేమ ఉండదు. కనుక చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఇ ఎంతో అవసరం. శరీరానికి తగినంత విటమిన్ ఇ అందించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. చర్మం యొక్క ఛాయ పెరుగుతుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మానికి నష్టం కలగకుండా ఉంటుంది. చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
అలాగే విటమిన్ డి లోపించడం వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపించడం వల్ల చర్మం తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడుతుంది. తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మం పొడిబారుతుంది. కనుక విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలి. తగినంత విటమిన్ డి ని అందించడం వల్ల చర్మం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. వ్యాధి కారక క్రిముల నుండి చర్మానికి హాని కలగకుండా ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హాని కలగకుండా కాపాడుతుంది. తగినంత విటమిన్ సి అందించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.
ముడతలు పడకుండా ఉంటుంది. ఇక చర్మ ఆరోగ్యానికి బి విటమిన్స్ కూడా చాలా అవసరం. బి విటమిన్స్ లోపించడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. పెదాలు పలుగుతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు, దద్దుర్లు వంటివి వస్తాయి. కనుక చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని బి విటమిన్స్ ఉండడం కూడా చాలా అవసరం. బి విటమిన్స్ లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అదే విధంగా చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఎ కూడా చాలా అవసరం. కొత్త చర్మ కణాలు తయారవ్వడానికి, చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ ఎ చాలా అవసరం. తగినంత విటమిన్ ఎ అందించడం వల్ల తామర వంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చర్మ ఆరోగ్యానికి కూడా విటమిన్స్ చాలా అవసరమని కనుక శరీరంలో విటమిన్స్ లోపం లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.