ఆహార పదార్థాలను తీపిగా కావాలనుకుంటే చాలా మంది చక్కెరను వేస్తుంటారు. అయితే నిజానికి చక్కెర కన్నా బెల్లం ఎంతో మేలు. చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల మనకు బెల్లం ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్కను తిన్నా చాలు. మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* బెల్లంలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ పడాల్సిన పనిలేదు. అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండదు. రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీంతో మలబద్దకం, గ్యాస్, ఎసీడీటీ సమస్యలు ఉండవు. బెల్లం తినడం వల్ల శ్వాసకోస సంబంధ సమస్యలు నయం అవుతాయి. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది.
* బెల్లం మన శరీరంలోని లివర్ కు ఎంతగానో మేలు చేస్తుంది. బెల్లం కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. రోజూ బెల్లంను తింటే లివర్‌లో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
* బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. కండరాల నిర్మాణం మెరుగు పడుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో జరుగుతుంది. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
* బెల్లంను తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం, ఇది బ్లడ్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటూ ఉంటే రక్తాన్నిశుద్ధి చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే వ్యాధులు రావు. అందువల్ల బెల్లాన్ని తింటే రక్తాన్ని శుభ్ర పరుచుకోవచ్చు. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
* బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలను క్రమపద్ధతిలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
* బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
* కీళ్ల నొప్పులు, మంటలతో బాధపడేవారు బెల్లం తింటుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజూ చిన్న బెల్లం ముక్కను మీకు ఇష్టమైన సమయంలో తినవచ్చు. రాత్రి భోజనం చేశాక తింటే మంచిది. ఇక బెల్లం, అల్లం కొద్ది కొద్దిగా కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూట తీసుకోవచ్చు. లేదా పాలలో బెల్లం కలుపుకుని తాగవచ్చు. దీని వల్ల కూడా ప్రయోజనాలు కలుగుతాయి.