Black Raisins : కిస్మిస్‌లు అంటే సహజంగానే గోధుమ రంగులో ఉంటాయి. ఆ కిస్మిస్‌ల గురించే చాలా మందికి తెలుసు. కానీ వీటిలో నలుపు రంగు కిస్మిస్‌లు కూడా ఉంటాయి. నల్ల ద్రాక్షలను ఎండబెట్టి నల్ల రంగు కిస్మిస్‌లను తయారు చేస్తారు. వీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే గుప్పెడు మోతాదులో తినాలి. అయితే సమయం లేదని అనుకునేవారు సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నల్ల కిస్మిస్‌లలో కాల్షియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
2. జుట్టు రాలుతున్నవారు, తెల్లని జుట్టు బాగా ఉన్నవారు నల్ల కిస్మిస్‌లను తింటే ప్రయోజనం కలుగుతుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. నల్ల కిస్మిస్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. రక్తహీనత సమస్య ఉన్నవారు వీటిని తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
5. స్త్రీలు నెలసరి సమయంలో నల్ల కిస్మిస్‌లను తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వీటి వల్ల నొప్పులు తగ్గుతాయి.
6. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అధికంగా ఉన్నవారు నల్ల కిస్మిస్‌లను తినాలి. దీంతో ఎల్‌డీఎల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
7. నల్ల కిస్మిస్‌లలో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
8. అసిడిటీ, మలబద్దకం సమస్యలు ఉన్నవారు ఈ కిస్మిస్‌లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.