ఆహారాన్ని రోజూ సరైన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను సరైన టైముకు చేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ కొందరు రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. అయితే ఈ విధంగా రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో, ఆ విధమైన అలవాటు ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆ ప్రభావం మెదడుపై తీవ్రంగా పడుతుంది. దీంతో సర్కేడియన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఫలితంగా నేర్చుకునే శక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి నశిస్తాయి.
2. రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. దీంతోపాటు బరువు తగ్గడం కష్టమవుతుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంది.
3. రాత్రి పూట రోజూ ఆలస్యంగానే తినే వారు కొన్ని రోజులకు నైట్ ఈటింగ్ సిండ్రోమ్ బారిన పడతారు. దీంతో సహజంగానే రాత్రి పూట ఆకలి వేస్తుంది. దీంతో మరింత ఎక్కువగా ఆహారం తింటారు. అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఇంకా బరువు పెరుగుతారు.
4. రాత్రి పూట త్వరగా భోజనం చేయకపోతే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఆలస్యంగా తిన్న ఆహారం కూడా జీర్ణం అవదు. జీర్ణ సమస్యలు వస్తాయి. మరుసటి రోజు మలబద్దకం ఏర్పడుతుంది.
5. రాత్రి పూట ఆలస్యంగా తింటే హైబీపీ వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.