Fear : నేటి తరుణంలో యుక్త వయసు వారి నుండి పెద్ద వారి వరకు చాలా మంది ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆందోళన అదుపులో ఉండక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దీని వల్ల మానసికంగా అలాగే శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆందోళన బాధపడే వారు వారు బాధపడుతూ ఇతరులను కూడా బాధిస్తూ ఉంటారు. మందులను వాడడం వల్ల సమస్య కొద్దిగా అదుపులో ఉన్నప్పటి పూర్తిగా మాత్రం తగ్గదు. ఇలా ఆందోళనతో బాధపడే వారు సహజసిద్దంగా చక్కటి ఆహారాలను తీసుకుంటూ కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నియమాలను పాటించడం వల్ల ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు చెబుతున్నారు. ఆందోళనను తగ్గించడంలో కొన్ని రకాల ఆహారాలు కూడా మనకు సహాయపడతాయి. వాటిలో పసుపు కూడా ఒకటి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయన సమ్మేళనం ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. కనుక ఆందోళనతో బాధపడే వారు నీటిలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుందని వారు చెబుతున్నారు. అయితే ఇలా తీసుకునే వారు ఆర్గానిక్ పసుపునే వాడాలి. అలాగే మెదడు కణాలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది. అవిసె గింజలు, చేపలు, వాల్ నట్స్, బాదంపప్పు వంటి వాటిని రోజూ తీసుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది.
అదే విధంగా బి కాంప్లెక్స్ ఎక్కువగా ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలు శుభ్రపడాలన్నా అవి సరిగ్గా పని చేయాలన్నా బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా అవసరమవుతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండే వాటిలో తవుడు కూడా ఒకటి. తవుడును నీటిలో కలిపి తీసుకోవచ్చు. అలాగే చపాతీ పిండిలో కలిపి చపాతీలు చేసుకుని తినవచ్చు. ఖర్జూరాలతో తినవచ్చు. ఇలా ఏదో ఒకరూపంలో తవుడును తీసుకోవడం వల్ల ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా ఉడికించని పచ్చి ఆహారాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆందోళన అంత త్వరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా ఉడికించని ఆహారాలను తీసుకోలేని వారు కనీసం 70 శాతం వరకైనా ఉడికించని ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఆందోళనతో బాధపడే వారు రోజూ రెండు పూటలా బ్రమరీ ప్రాణాయామం చేయాలి. అలాగే మరో 10 నిమిషాల పాటు ఇతర ప్రాణాయామాలు చేయాలి. అలాగే రోజూ అరగంట పాటు ధ్యానం చేయాలి. ఈ విధంగా ఈ ఆహార నియమాలను పాటిస్తూ ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల ఆందోళన నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.