Fennel And Ginger Milk : వీటిని రోజూ తాగండి.. కీళ్ల నొప్పులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్‌లు రావు.. ర‌క్తం బాగా ప‌డుతుంది..!

Fennel And Ginger Milk : ఈ విధంగా పాల‌ను తాగితే చాలు మ‌న ఒంట్లో ఉండే నీర‌సాన్ని, అల‌స‌ట‌ను, నిస్స‌త్తువ‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే చిన్న వ‌య‌సులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలాంటి వారు మ‌న ఇంట్లోనే ఉండే వివిధ ర‌కాల ప‌దార్థాల‌ను పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. శ‌క్తిని, బ‌లాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో వ‌చ్చే మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే ఈ పాల‌ను ఎవ‌రైనా తాగ‌వ‌చ్చు. పాల‌ను ఏ విధంగా త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక గ్లాస్ పాల‌ను, ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను, ఒక ఇంచు అల్లం ముక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను తీసుకుని వేడి చేయాలి. పాలు వేడ‌య్యాక సోంపు గింజ‌ల‌ను అలాగే అల్లం ముక్క‌ల‌ను వేయాలి. వీటిని 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో రుచి కొర‌కు తేనెను లేదా ప‌టిక బెల్లాన్ని వేసి క‌లిపి తాగాలి. పంచ‌దార‌ను మాత్రం ఉప‌యోగించ‌కూడ‌దు. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అలాగే శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు.

Fennel And Ginger Milk make in this method drink daily for these benefits
Fennel And Ginger Milk

ఈ విధంగా పాల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌నం త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ర‌క్త‌నాళ్లాల్లో అడ్డంకులు కూడా తొల‌గిపోతాయి. ఈ విధంగా పాల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. పాలు, సోంపు, అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను రాత్రి నిద్ర‌పోవ‌డానికి అర‌గంట ముందు తాగాలి. ఈ విధంగా పాల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అలాగే అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేరుకుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు.

Share
D

Recent Posts