Fennel Seeds With Milk : రోజూ రాత్రి దీన్ని తాగండి.. మీ శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతారు..!

Fennel Seeds With Milk : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను తాగుతూ ఉంటాము. పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని దీనిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే సాధార‌ణ పాల‌ను కాకుండా సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేస‌వికాలంలో సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అంతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సోంపు పాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సోంపు మ‌నంద‌రికి తెలిసిందే. దీనిలో ఐర‌న్, కాప‌ర్, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ సి, సెలీనియం వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. మ‌నం తిన్న ఆహారం చ‌క్క‌గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. సోంపు పాల‌ను తాగ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్ష‌న్స్ రా3కుండా ఉంటాయి. శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. అంతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. శ‌రీరంలో క్యాల్షియం లోపం త‌లెత్తకుండా ఉంటుంది. ఎముక‌లు ధృడంగా, బ‌లంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సోంపు పాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… ఎప్పుడు తాగాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Fennel Seeds With Milk drink this daily at night for these benefits
Fennel Seeds With Milk

ఈ పాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను, రెండు టీ స్పూన్ల సోంపు గింజ‌ల‌ను వేసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు వేడి చేయాలి. పాలు బాగా మ‌రిగి పొంగు వ‌చ్చిన త‌రువాత వాటిని వ‌డ‌క‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ సోంపును తిని పాల‌ను తాగాలి. అయితే ఇందులో పంచ‌దార‌ను మాత్రం క‌ల‌ప‌కూడ‌దు. రుచి కొర‌కు కొద్దిగా ప‌టిక బెల్లం పొడిని క‌లుపుకోవాలి. ఈ పాల‌ను రోజూ రాత్రి ప‌డుకోవ‌డానికి అర‌గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. అంతతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గి చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. గ‌ర్భిణీ స్త్రీలు కూడా ఈ పాల‌ను తాగ‌వ‌చ్చు. అయితే ఒక టీ స్పూన్ సోంపును మాత్ర‌మే వేసుకోవాలి. అలాగే ఈ పాల‌ను వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎవ‌రైనా తాగ‌వ‌చ్చు. ఈ విధంగా సోంపు పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts