Fenugreek And Kalonji Seeds : మెంతుల‌ను వీటితో క‌లిపి తీసుకుంటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Fenugreek And Kalonji Seeds : మ‌న వంటింట్లో ఉండే దినుసులల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులను మనం వంట‌ల్లో, పులుసు కూర‌ల్లో అలాగే పొడిగా చేసి ప‌చ్చ‌ళ్ల‌ల్లో వాడుతూ ఉంటాము. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మెంతుల‌ను కొంద‌రు నాన‌బెట్టి తింటూ ఉంటారు. కొంద‌రు వీటితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. మ‌రికొంద‌రు వీటిని పొడిగా చేసి నీటిలో క‌లిపి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మెంతుల‌ను కాళోంజి విత్త‌నాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులు మ‌రియు కాళోంజి విత్త‌నాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. పీచు ప‌దార్థాలు, క్యాల్షియం, ఐర‌న్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక ర‌కాల పోష‌కాలు ఈ దినుసుల్లో ఉంటాయి. వీటిని క‌లిపి తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను స‌మానంగా తీసుకుని రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపులో నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌ని చేస్తుంది.

Fenugreek And Kalonji Seeds take these daily for many benefits
Fenugreek And Kalonji Seeds

అలాగే మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. ఫ్యాటీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను నాన‌బెట్టిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా, చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అదే విధంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో మెంతులు మ‌రియు కాళోంజి విత్త‌నాలు ఇవి రెండు కూడా మన‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. షుగర్ వ్యాధితో బాధప‌డే వారు మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను నాన‌బెట్టిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి.

అలాగే వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక మెంతుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే మ‌న శ‌రీర ఆరోగ్యానికే కాదు మ‌న సౌంద‌ర్యానికి కూడా మెంతులు మ‌రియు కాళోంజి విత్త‌నాలు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి వాటి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించ‌డంలో కూడా మెంతులు మ‌రియు కాళోంజి విత్త‌నాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ విధంగా మెంతులు మ‌రియు కాళోంజి విత్త‌నాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts