మనలో కొందరు ఎక్కువ కాలం పాటు జీవిస్తారు. కొందరికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. అయితే వంశ పారంపర్యంగానే ఇలా జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే మషులకు ఎక్కువ ఆయుర్దాయం ఉండడం అనేది వారి జన్యువులపై ఆధార పడదు. ఆ విషయంలో జన్యువులు చాలా తక్కువ పాత్ర పోషిస్తాయి. అందువల్ల వ్యక్తుల ఆయుర్దాయం పెరగాలంటే జన్యువుల మీద ఆధార పడకూడదు. అందుకు కొన్ని సూచనలు పాటించాలి. అవేమిటంటే..
పరిశోధనల ప్రకారం.. పర్యావరణ కారకాలు, ఆహారం, జీవనశైలి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. తద్వారా మన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
ఎక్కువ కాలం పాటు జీవించాలన్నా, ఆయుష్షు పెరగాలన్నా అతిగా తినడం మానుకోవాలి. అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీవిత కాలం తగ్గుతుంది. అందువల్ల తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
నట్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ వివిధ రకాల నట్స్ అన్నీ కలిపి గుప్పెడు మోతాదులో తింటుండాలి. దీంతో ఎక్కువ కాలం జీవించవచ్చు.
ఆకు కూరలు, కూరగాయలను రోజూ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పండ్లను తినాలి. ఇవి ఆయుర్దాయాన్ని పెంచుతాయి. ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.
రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలి. లేదా వ్యాయామం అయినా చేయాలి. దీని వల్ల ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది.
ధూమపానం, మద్యపానం మానేయాలి. ఇవి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. రోజూ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల కూడా ఎక్కువ కాలం జీవించవచ్చు.
ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆయుష్షు పెరగాలన్నా నిద్ర ఎంతో కీలకం. రోజూ కనీసం 7-8 గంటల నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.