కరోనా కారణంగా ఫేస్ మాస్క్‌లను వాడడం తప్పనిసరి అయింది. గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండేందుకు మనం ఫేస్ మాస్క్‌లను ధరిస్తున్నాం. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైరస్ బారి నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఏర్పడింది. అందువల్ల వారిచే పెద్దలు కచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతున్న ప్రకారం.. ఎన్95 లేదా ఎఫ్‌ఎఫ్‌పీ2 రెస్పిరేటర్ (మాస్క్) లేదా అందుకు సమానమైన సదుపాయాలు కలిగిన మాస్క్‌లను ధరిస్తే కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఈ క్రమంలోనే మాస్క్‌ల వల్ల మనం పీల్చే గాలి 95 నుంచి 99 శాతం వరకు ఫిల్టర్ అవుతుంది. దీంతో వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది.
అయితే మాస్క్‌లకు ఆర్గానిక్ యాంటీ మైక్రోబియల్ కోటింగ్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. అందువల్ల చిన్నారులకు ఆయా సదుపాయాలు గల మాస్క్‌లను ధరింపజేయాలి. దీంతో కరోనా వైరస్ వారికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
మాస్క్‌లను పిల్లలకు ధరింపజేసే విషయానికి వస్తే క్లాత్ మాస్క్‌ల కన్నా ఎన్95 మాస్క్‌లు మేలని నిపుణులు చెబుతున్నారు. ఆ మాస్క్‌లకు యాంటీ మైక్రోబియల్ కోటింగ్ ఉంటే ఇంకా మంచిది. అందువల్ల అలాంటి మాస్క్‌లను పిల్లలచే ధరింపజేయాలి. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు.