Heart Attack : ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి కామన్ అయిపోయాయి. ఒకప్పుడు వృద్ధులకే గుండె పోటు వచ్చేది. కానీ ప్రస్తుతం 20 ఏళ్లు నిండిన వారికి కూడా గుండె పోటు వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. మితిమీరిన వ్యాయామం చేయడంతోపాటు అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల కూడా హార్ట్ ఎటాక్‌ల బాధితులు పెరిగిపోతున్నారు. అయితే గుండె పోటు వచ్చాక బాధపడడం కన్నా అది రాక ముందే కొన్ని రకాల సూచనలు పాటిస్తే దాంతో జీవితంలో ఇక గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. మీ గుండె ఎల్లప్పుడూ సేఫ్‌గా ఉంటుంది. వృద్ధాప్యం వచ్చాక కూడా హార్ట్ ఎటాక్‌లు రావు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రాత్రి పూట చాలా మంది ఆలస్యంగా భోజనం చేసి ఆలస్యంగా నిద్రిస్తుంటారు. అలాగే మాంసాహారం తినడం, మద్యం సేవించడం లేదా రాత్రి చాలా వరకు పనిచేస్తూనే ఉండడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు, ఊపిరితిత్తులకు, గుండెకు రెస్ట్ అనేది ఉండదు. అవి రాత్రి కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో వాటిపై భారం పడుతుంది. అది హార్ట్ ఎటాక్‌లకు దారి తీస్తుంది. అందుకనే చాలా మందికి రాత్రి పూట హార్ట్ ఎటాక్‌లు వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
సాయంత్రం 7 గంటల లోపే భోజనం ముగించాలి. అది కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. రెండు పుల్కాలు లేదా కొన్ని రకాల పండ్లను రాత్రి పూట తీసుకోవాలి. ఇలా ఆహారం తీసుకున్న తరువాత రాత్రి 10 గంటల వరకు నిద్రించాలి. ఆలస్యం చేయరాదు. ఆ సమయం వరకు 3 గంటలు గ్యాప్ వస్తుంది. కనుక తిన్న ఆహారం మొత్తం జీర్ణమవుతుంది. దీంతో రాత్రి 10 గంటలకు నిద్రించే సమయానికి గుండె, జీర్ణవ్యవస్థ, ఊపిరితిత్తులు.. ఇతర అవయవాలు అన్నీ విశ్రాంతిలోకి వెళ్లిపోతాయి. అవి చాలా నెమ్మదిగా పనిచేస్తాయి. దీంతో వాటిపై భారం పడదు. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. రక్త సరఫరాకు ఇబ్బందులు ఏర్పడవు. దీని వల్ల గుండెపై భారం పడదు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
ఇలా రాత్రి పూట త్వరగా తిని త్వరగా నిద్రించడం వల్ల అవయవాలు అన్నీ రిలాక్స్ అయి వాటిపై భారం పడదు. దీంతో గుండె పోటు రాకుండా ఉంటుంది. ఇలా హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ విధమైన అలవాట్లను రోజూ పాటించే వారికి అసలు లైఫ్‌లో హార్ట్ ఎటాక్‌లు అనేవి రావని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. కనుక ఈ రకమైన ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే మీ గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు.