ప్రస్తుత తరుణంలో చాలా మంది తమకు యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కొందరిలో యూరిక్ యాసిడ్ మరీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో అది శరీరంలో పేరుకుపోతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతే అనేక సమస్యలు వస్తాయి. గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ మన శరీరంలో రోజూ ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో ఏర్పడే ప్యూరిన్లు యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్యూరిన్లు ప్రోటీన్లను ఎక్కువగా తినడం వల్ల ఉత్పత్తి అవుతాయి.
యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించుకోవాలంటే నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీంతో యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వస్తుంది.
యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
డ్రై ఫ్రూట్స్ అయిన మఖనా, ఖర్జూరాలు, వాల్ నట్స్ ను ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
లెమన్ వాటర్, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు వాపులను తగ్గిస్తాయి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగాలి. అలాగే సూప్‌లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని రోజూ కీళ్లపై మర్దనా చేయవచ్చు. అలాగే లోపలికి కూడా తీసుకోవచ్చు. దీంతో సమస్య తగ్గుతుంది.