Frequent Urination Diet : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. మూత్రవిసర్జన చేయడం చాలా అవసరం. కొందరు గంటలో రెండు సార్లు మూత్రానికి వెళ్తుండగా కొందరు పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వచ్చి ఇబ్బందిపడుతుంటారు. ఇలా జరగడాన్ని సాధారణంగా తీసుకోకూడదు. ఒక వ్యాధి లక్షణంగా భావించాలి. ఈ నేపథ్యంలో తరచూ మూత్ర విసర్జనకు ఎందుకు వెళ్లాలి… ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ మూత్రవిసర్జనరకు వెళ్లడం అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిలో కనబడుతుంది.
ఈ సమస్య చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కవగా తాగినా సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకోని సమయంలో కూడా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతి మూత్ర విసర్జన సమస్యగా భావించాలి. ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో కూడా ఈ సమస్య కనబడుతుంది.బీపీతో బాధపడే వారు వారు వాడే కొన్ని మందుల కారణంగా మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో వారు తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా ఈ సమస్యను మనం గమనించవచ్చు.
మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారవడానికి కారణం అవుతాయి. కనుక కొన్ని రకాల ఆహార నియమాలను పాటించడం వల్ల మనం ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. సిట్రస్ అధికంగా ఉండే నారింజ, నిమ్మ, బత్తాయి, ఫైనాఫిల్, ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కనుక అతి మూత్ర విసర్జనతో బాధపడే వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మూత్రాశయంపై ఒత్తిడిని కలిగించే శీతల పానీయాలను తీసుకోకూడదు. అలాగే కెఫిన్ కలిగే ఉండే టీ, కాఫీలను, ఎనర్జీ డ్రింక్, చాక్లెట్ లను కూడా తీసుకోకూడదు. ,ఆలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని ఖర్జూరాలను తీసుకుంటూ ఉంటారు.
కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్ కలిగిన పదార్థాలను, పుల్లటి రుచి కలిగి ఉండే క్రీములను తీసుకోవడం వల్ల మూత్రాశయం పై ఒత్తిడి అధికమయ్యి తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే మూత్రంలో మంట, నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అతి మూత్ర వ్యాధితో బాధపడే వారు ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే మంచిది. అలాగే వీరు పచ్చి టమాటాలను, పచ్చి ఉల్లిపాయను, చక్కెరను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. బెర్రీల్లో కూడా ఆమ్లాల శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తినగానే మూత్రానికి వెళ్లాలి అనే కోరిక కలుగుతుంది.
ఇలాంటి తినడం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది. నిత్యం తినే ఆహారాల్లో మసాలాలను తగ్గించాలి. ఈ ఆహార నియమాలను పాటించడం వల్ల మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. చాలా మంది మూత్రవిసర్జన చేయకుండా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మంచ పద్దతి కాదు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.