హెల్త్ టిప్స్

తలనొప్పి, అసహనం రుగ్మతలు పీడిస్తున్నాయా..?! 7 గంటలు నిద్రపోండి..!

నీటిని ఎంత ఎక్కువగా తాగితే మన శరీరానికి అంత మంచిది, దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కొంత వేడి నీటిలో 1 కప్పు నువ్వులను దాదాపు రెండు గంటలు నానబెట్టిన తరువాత వాటిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని ఒక కప్పు పాలతో కలిపి, అందులో కొంచెం బెల్లం వేసి రోజూ తీసుకుంటే అజీర్తి తొలగి పోయి మంచి జీర్ణశక్తి మీ సొంతమవుతుంది. నువ్వులను ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, పొడి చేసుకోవాలి, ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసి రోజూ మూడు పూటలా పాలతో పాటు తీసుకోవాలి, ఇలా పదిరోజులు చేస్తే మలబద్దకం పరారవుతుంది.

ఫాస్ట్ ఫుడ్‌ను దూరంగా పెట్టి పోషక విలువలు ఎక్కువ ఉండే ఆకుకూరలు, కాయగూరలను సమృద్ధిగా తింటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దగ్గు, జలుబు లాంటి ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మందుల వాడకాన్ని తగ్గించండి. ఆయుర్వేదంలో పేర్కొన్న ప్రకృతి వరప్రసాదాలు శొంఠి, మిరియాలు లాంటి వాటితో కషాయము చేసి తీసుకుంటే మంచిది.

get sleep daily for 7 hours if you have these problems

కనీసం 6 లేక 7 గంటలవరకు నిద్రపోవాలి, నిద్ర మనకు చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది తలనొప్పి, అసహనం, ఏ విషయంపైనా సరయిన ఏకాగ్రత లేకుండా చేయడం లాంటి సమస్యలకు కారణమవుతుందని గుర్తుంచుకోండి.

Admin

Recent Posts